వరంగల్ నగరానికి చెందిన ఒక రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ని సైబర్ నేరగాళ్లు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో ఒక నకిలీ వెబ్‌సైట్ ద్వారా నమ్మించారు. ఆ వెబ్‌సైట్ ద్వారా పరిచయం ఏర్పరచుకుని, అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి విడతల వారీగా నగదు జమ చేయించుకున్నారు.
నిందితులు బాధితుడిని అదనంగా ‘ఆదాయ పన్ను’ (Income Tax) కట్టాలని అడగడంతో ఆయనకు అనుమానం వచ్చింది. దీంతో తాను మోసపోయానని గ్రహించి విషయాన్ని బయటపెట్టారు. బాధితుడి మనవడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


