వరంగల్ మహానగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో భారీ పాము ప్రత్యక్షమవ్వడం అధికారులను, సిబ్బందిని భయాందోళనకు గురిచేసింది.
కార్యాలయంలోని బాత్రూమ్లోకి వెళ్లిన ఉద్యోగులకు ఒక్కసారిగా భారీ పాము కనిపించింది. పాము బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి కార్యాలయంలోకి ప్రవేశించకుండా సిబ్బంది వెంటనే బాత్రూమ్ తలుపులు మూసివేశారు. బాత్రూమ్ లోపల బయటపడటానికి పాము అటూ ఇటూ తిరుగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.


