HomeLatest Newsతల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీతంలో కోత.. ఎవరికీ వర్తిస్తుంది..?

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీతంలో కోత.. ఎవరికీ వర్తిస్తుంది..?

Published on

spot_img

వృద్ధాప్యంలో కన్నవారిని అండగా చూసుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఉద్యోగుల జవాబుదారీతనం, తల్లిదండ్రుల పోషణ పర్యవేక్షణ బిల్లు-2026’ను ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 

తల్లిదండ్రుల బాధ్యతను విస్మరించే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఈ బిల్లును రూపొందించారు.​ ఎవరైనా ఉద్యోగి తన తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోతే, వారి నెలవారీ వేతనం నుండి 15% లేదా రూ.10,000 (ఏది తక్కువైతే అది) కట్ చేసి నేరుగా తల్లిదండ్రులకు చెల్లిస్తారు.

ఎవరికి వర్తిస్తుంది?

 ఈ చట్టం కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా.. ప్రైవేట్ ఉద్యోగులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మరియు సర్పంచ్‌లకు కూడా వర్తిస్తుంది.

​ బాధితులైన తల్లిదండ్రులు సంబంధిత జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఫిర్యాదు అందిన 60 రోజుల్లోపు సమస్యను పరిష్కరించి, తల్లిదండ్రులకు న్యాయం చేయాల్సి ఉంటుంది. ​సామాజిక బాధ్యతను పెంచే దిశగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా సర్వత్రా చర్చ నడుస్తోంది.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.