HomeWarangal Newsయుద్ధప్రాతిపదికన డ్రైన్లలో పూడిక తొలగింపు చేపట్టాలి: మేయర్ గుండు సుధారాణి

యుద్ధప్రాతిపదికన డ్రైన్లలో పూడిక తొలగింపు చేపట్టాలి: మేయర్ గుండు సుధారాణి

Published on

spot_img

వరంగల్: గ్రేటర్ వరంగల్ నగర వ్యాప్తంగా ఉన్న డ్రైన్లలో పూడిక తొలగింపు ప్రక్రియను యుద్ధప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. నగర పాలక సంస్థ ప్రకటించిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా శనివారం ఆమె క్షేత్రస్థాయిలో పర్యటించారు.

మేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్న 29వ డివిజన్ రఘునాథ కాలనీ ప్రాంతంలో కొనసాగుతున్న పూడిక తీత పనులను ఆమె స్వయంగా పరిశీలించారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో నగరంలో ఎక్కడా నీరు నిలవకుండా, డ్రైన్లన్నీ సాఫీగా ప్రవహించేలా పూడికను సమర్థవంతంగా తొలగించాలని సూచించారు.

​ 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ​పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడకూడదని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులు త్వరితగతిన ముగించాలని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles