HomeWarangal Newsహన్మకొండలో 6వ రోజుకు చేరిన విద్యుత్ ఆర్టిజన్ల సమ్మె

హన్మకొండలో 6వ రోజుకు చేరిన విద్యుత్ ఆర్టిజన్ల సమ్మె

Published on

spot_img

హన్మకొండ: తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (TGNPDCL) పరిధిలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించడం ఏమాత్రం సరైంది కాదని 327 యూనియన్ నేత నీలారపు శ్రీనివాస్ విమర్శించారు.

​హన్మకొండ నక్కలగుట్టలోని ఎస్‌ఈ (SE) కార్యాలయం వద్ద ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె నేటికి ఆరో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కార్మికులకు సమ్మె శిబిరాన్ని సందర్శించిన శ్రీనివాస్ తమ సంఘీభావాన్ని ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన క్షేత్రస్థాయిలో విద్యుత్ సరఫరా కోసం నిరంతరం శ్రమిస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, కార్మికుల న్యాయమైన డిమాండ్లను పట్టించుకోకుండా కాలయాపన చేయడం తగదని మరియు తక్షణమే ఉన్నతాధికారులు, ప్రభుత్వం స్పందించి క్షేత్రస్థాయి సిబ్బందికి భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.

​ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని, తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles