HomeWarangal Newsవేయి స్తంభాల గుడి పునరుద్ధరణకు నిధుల మంజూరు..కడియం కావ్య కృషికి ఫలితం

వేయి స్తంభాల గుడి పునరుద్ధరణకు నిధుల మంజూరు..కడియం కావ్య కృషికి ఫలితం

Published on

spot_img

చారిత్రక హన్మకొండలోని వేయి స్తంభాల గుడి (Thousand Pillar Temple) అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో ఆలయ ప్రాంగణంలో నిలిచిపోయిన పనులను పూర్తి చేయనున్నారు.

ఆలయం పునర్నిర్మాణానికి రూ. 14.44 కోట్లు మంజూరు అయ్యాయి. అందులో భాగంగా ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపం పునర్నిర్మాణం, పెండింగ్‌లో ఉన్న పునరుద్ధరణ పనులు మరియు ఆలయ విస్తరణ కార్యక్రమాలు జరుగుతాయి.

కాకతీయుల కళా వైభవానికి ప్రతీకగా నిలిచే ఈ ఆలయాన్ని పూర్తిస్థాయిలో తీర్చిదిద్దేందుకు ఈ నిధులు ఎంతో కీలకం కానున్నాయి. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య నిరంతర కృషితో ఈ నిధులు విడుదలకై కీలక పాత్ర పోషించారు. ఆమె పలుమార్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి Gajendra Singh Shekhawatను కలిసి ఆలయ అభివృద్ధి అవసరాన్ని వివరించినట్లు తెలిసింది. అదేవిధంగా పురావస్తు శాఖ అధికారులతో కలిసి ఆలయాన్ని సందర్శించి, పునరుద్ధరణ అవసరాలపై నివేదిక రూపొందించి కేంద్రానికి సమర్పించారు.

Letter on Thousand Pillars Temple

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles