HomeWarangal Newsవరంగల్ : మంత్ర తంత్రాల పేరిట మోసాలు.. రంగంలోకి దిగిన వరంగల్ సీపీ

వరంగల్ : మంత్ర తంత్రాల పేరిట మోసాలు.. రంగంలోకి దిగిన వరంగల్ సీపీ

Published on

spot_img

వరంగల్: జిల్లాలో అమాయక ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని, ఆర్‌ఎంపీ డాక్టర్ల ముసుగులో మంత్ర తంత్రాల పేరిట సాగుతున్న దందాలపై వరంగల్ పోలీస్ కమిషనర్ (CP) సీరియస్ అయ్యారు. దీనిపై వస్తున్న కథనాలపై స్పందించిన ఆయన, సమగ్ర విచారణకు ఆదేశించారు.

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని కట్యాల గ్రామంలో కొంతమంది వ్యక్తులు ఆర్‌ఎంపీ డాక్టర్లమని చెప్పుకుంటూనే, తెరచాటున క్షుద్ర పూజలు, మంత్ర తంత్రాల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. రోగాలను నయం చేస్తామని నమ్మబలుకుతూ ప్రజలను ఆర్థికంగా, మానసికంగా వేధిస్తున్న ఈ ముఠా ఉదంతం కలకలం రేపుతోంది.

​వార్తా కథనాల ఆధారంగా వివరాలు సేకరించిన సీపీ, క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించారు. జిల్లావ్యాప్తంగా ఇలాంటి దందాలు ఎక్కడ సాగుతున్నా వదిలిపెట్టవద్దని పోలీసు అధికారులకు సూచించారు. అనుమానిత వ్యక్తులను పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వాలని ఆదేశించారు.

​ ఎవరైనా బాధితులు ఫిర్యాదు చేస్తే వెంటనే ఎఫ్.ఐ.ఆర్ (FIR) నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.​ ప్రజలు మూఢనమ్మకాలతో మోసపోకూడదు. అనారోగ్య సమస్యలు ఉంటే అర్హత కలిగిన డాక్టర్లను సంప్రదించాలి తప్ప, ఇలాంటి మంత్రగాళ్లను నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. ఎవరైనా మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలాని అన్నారు. ​ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇలాంటి ముఠాల ఆటకట్టించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles