HomeWarangal Newsతల్లి ఆరోగ్యం సురక్షితంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన సమాజం: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

తల్లి ఆరోగ్యం సురక్షితంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన సమాజం: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

Published on

spot_img

వరంగల్, ఏప్రిల్ 08: తల్లి ఆరోగ్యం సురక్షితంగా ఉండడం సమాజ అభివృద్ధికి అత్యంత కీలకమని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “సేఫ్ మదర్స్ డే” కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

వరంగల్‌లోని CKM మెటర్నిటీ హాస్పిటల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవితో కలిసి ఎమ్మెల్యే పాల్గొని, హాస్పిటల్‌ను సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న గర్భిణీ స్త్రీలను పరామర్శించి, వారికి అందుతున్న వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి గర్భిణీ మహిళకు సురక్షిత ప్రసవం జరిగేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. గర్భధారణ సమయంలో క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం, వైద్యుల సూచనలు పాటించడం, పోషకాహారం తీసుకోవడం అత్యంత అవసరమని సూచించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణీ స్త్రీలకు ఉచితంగా అందుతున్న వైద్య సేవలు, పరీక్షలు, మందులు తదితర సదుపాయాలను తప్పకుండా వినియోగించుకోవాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది, ఆరోగ్య శాఖ సిబ్బంది గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు.

తల్లి ఆరోగ్యం బాగుంటేనే శిశువు ఆరోగ్యంగా జన్మిస్తాడని, తద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. మహిళల ఆరోగ్యం, శిశు సంక్షేమం కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, ప్రభుత్వ ఆసుపత్రులను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు.

సేఫ్ మదర్స్ డే వంటి కార్యక్రమాలు ప్రజల్లో అవగాహన పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని, ప్రతి గర్భిణీ మహిళ సురక్షిత ప్రసవం పొందేలా అందరూ కలిసి పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్, వైద్యులు, సిబ్బంది, గర్భిణీ స్త్రీలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles