HomeWarangal Newsవరంగల్: కార్యదర్శి సంతకం ఫోర్జరీ.. అధికారుల విచారణ

వరంగల్: కార్యదర్శి సంతకం ఫోర్జరీ.. అధికారుల విచారణ

Published on

spot_img

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చెరువుకొమ్ము తండాలో ఫోర్జరీ ఘటన వెలుగుచూసింది. ఒక వ్యక్తి ప్రైవేట్ ఫైనాన్స్ లోన్ పొందేందుకు గ్రామ పంచాయతీ సెక్రటరీ సంతకాన్ని మరియు రబ్బరు స్టాంపులను ఫోర్జరీ చేశాడు. ఆస్తి యజమాన్య ధృవీకరణ పత్రంపై నకిలీ సంతకం పెట్టి ఫైనాన్స్ వారికి సమర్పించాడు.

​ఈ నెల 9న సదరు ఫైనాన్స్ ప్రతినిధులు వెరిఫికేషన్ కోసం సీ కే తండా పంచాయతీ సెక్రటరీ మాలతిని సంప్రదించగా అసలు విషయం బయటపడింది. ఆ సర్టిఫికేట్ తాను జారీ చేయలేదని, తన వద్ద ఉన్న రబ్బరు స్టాంపులు ఇంగ్లీష్‌లో ఉంటే, ఫోర్జరీ పత్రంపై తెలుగులో ఉన్నాయని ఆమె గుర్తించారు. ఈ మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సెక్రటరీ తెలిపారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles