“ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా వరంగల్ నగర బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
జీడబ్ల్యూఎంసీ (GWMC) సహకారంతో, ఫీనిక్స్ ఫౌండేషన్ మరియు శంకర కంటి ఆసుపత్రి సంయుక్తంగా నిర్వహించిన ఈ శిబిరాన్ని వరంగల్ (పశ్చిమ) ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హన్మకొండ జిల్లా కలెక్టర్ మరియు బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి నగర మేయర్ గుండు సుధారాణి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మి సురేందర్, ఫీనిక్స్ ఫౌండేషన్ డైరెక్టర్ అవినాష్, శంకర కంటి ఆసుపత్రి మేనేజర్ బాలరాజు, సిఎంహెచ్ఓ డా. రాజారెడ్డి, ఎంహెచ్ఓ డా. రాజేష్, హెచ్ఓ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


