వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి తిమింగలాల వేట కొనసాగుతోంది. తాజాగా సబ్ రిజిస్ట్రార్-1 జమలాపురి రామనరసింహారావును సస్పెండ్ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నెల 3వ తేదీన జరిగిన ఏసీబీ దాడుల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు, భారీగా అక్రమ ఆస్తులు బయటపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే కేసులో గతంలోనే సబ్ రిజిస్ట్రార్-2 ఆనంద్‌ను అధికారులు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు అధికారుల మధ్య దాదాపు రూ. 43 లక్షల విలువైన ఆన్లైన్ లావాదేవీలు జరిగినట్లు విచారణలో వెల్లడైంది.
వరుసగా ఇద్దరు ఉన్నతాధికారులు సస్పెండ్ కావడంతో వరంగల్ రిజిస్ట్రేషన్ శాఖలో పెను సంచలనం రేగింది.


