HomePoliticsతేజస్వి సూర్య వ్యాఖ్యలపై ఎంపీ కడియం కావ్య ఫైర్: తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిస్తే సహించం

తేజస్వి సూర్య వ్యాఖ్యలపై ఎంపీ కడియం కావ్య ఫైర్: తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిస్తే సహించం

Published on

spot_img

న్యూఢిల్లీ: పార్లమెంట్ సాక్షిగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధిని, ఏర్పాటును తక్కువ చేస్తూ మాట్లాడటం అన్యాయమని, వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

​ తెలంగాణ ఏర్పాటును భారత్-పాక్ విభజనతో పోల్చడం అత్యంత అభ్యంతరకరమని ఆమె పేర్కొన్నారు. సోనియా గాంధీ గారు ప్రజల ఆకాంక్షను గుర్తించి రాష్ట్రాన్ని ఇచ్చారని, అటువంటి రాష్ట్రాన్ని అవమానించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు.

​ తెలంగాణ ఏర్పాటును ‘బ్లాక్ డే’గా పరిగణించే బీజేపీకి, ఈ రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు లేదని ఆమె హెచ్చరించారు.

దేశ జీడీపీకి అధిక వాటా అందిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు డిలిమిటేషన్ వల్ల సీట్ల సంఖ్యలో అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా నియంత్రణ పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాలను శిక్షిస్తారా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు.

మహిళా రిజర్వేషన్ బిల్లును 2023లో ఆమోదించి, అమలును ఎందుకు వాయిదా వేస్తున్నారని నిలదీశారు. కులగణన చేయకుండా రిజర్వేషన్లు అమలు చేస్తే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు అన్యాయం జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు.

​ మహిళా శక్తి గురించి మాట్లాడే ప్రధాని మోదీ, దేశంలో మహిళలపై దాడులు జరిగినప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు.

​తెలంగాణ ప్రజల త్యాగాలను, ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా బీజేపీ నేతలు మాట్లాడటం మానుకోవాలి. మాటలు చెప్పడం కాదు, తెలంగాణకు రావాల్సిన హక్కులను తక్షణమే కల్పించాలి – డాక్టర్ కడియం కావ్య, ఎంపీ (వరంగల్)

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

కాంగ్రెస్ భూ స్కామ్‌లు, 22A దుర్వినియోగంపై BRS ధ్వజం

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ పార్టీ భూ అక్రమాలు మరియు 22A నిబంధనల దుర్వినియోగంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.

కాంగ్రెస్, BRSలపై ఫైర్ అయిన బీజేపీ నేత రామచందర్ రావు

రాష్ట్రంలో కాంగ్రెస్, BRS పార్టీలు ప్రజా సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసి, వీధి నాటకాలు ఆడుతున్నాయని బీజేపీ నేత ఎన్. రామచందర్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పబ్లిసిటీ కోసమే ఆ రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని, వారి వైఖరిని చూసి తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.

కొండా సురేఖను బీఆర్‌ఎస్‌లోకి రానివ్వం: జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ నాయకురాలు, మంత్రి కొండా సురేఖను బీఆర్‌ఎస్ పార్టీలోకి చేర్చుకునే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. కొండా సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వబోమని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.