HomePoliticsపార్లమెంట్ వద్ద వరంగల్ ఎంపీ కడియం కావ్య ధర్నా: తెలంగాణపై తేజస్వీ సూర్య వ్యాఖ్యలకు నిరసన

పార్లమెంట్ వద్ద వరంగల్ ఎంపీ కడియం కావ్య ధర్నా: తెలంగాణపై తేజస్వీ సూర్య వ్యాఖ్యలకు నిరసన

Published on

spot_img

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని భారత్-పాకిస్థాన్ విభజనతో పోలుస్తూ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్లమెంట్ వేదికగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా నిరసిస్తూ వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య శుక్రవారం పార్లమెంట్ మకర ద్వారం వద్ద భారీ ధర్నా చేపట్టారు.

కాంగ్రెస్ ఎంపీలతో కలిసి చేపట్టిన ఈ నిరసనలో కడియం కావ్య ఫ్లాకార్డులను ప్రదర్శిస్తూ బీజేపీ తీరును ఎండగట్టారు. “తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించాలి”, “బీజేపీ వెంటనే క్షమాపణ చెప్పాలి” అంటూ ఎంపీలు చేసిన నినాదాలతో పార్లమెంట్ ప్రాంగణం మార్మోగింది.

ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై నిప్పులు చెరిగారు.

​దశాబ్దాల సుదీర్ఘ పోరాటం, ఎంతోమంది యువకుల బలిదానాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని భారత్-పాక్ విభజనతో పోల్చడం అత్యంత దుర్మార్గం. ఇది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించడమే.

​ రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినా, తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇచ్చారని ఆమె గుర్తు చేశారు.

తెలంగాణ పట్ల బీజేపీ నేతలు నిరంతరం వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారని, గతంలో ‘బ్లాక్ డే’ వంటి వ్యాఖ్యలు చేసి ఇప్పుడు విభజనతో పోల్చడం వారి అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు.

తేజస్వీ సూర్య తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కడియం కావ్య డిమాండ్ చేశారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

కాంగ్రెస్ భూ స్కామ్‌లు, 22A దుర్వినియోగంపై BRS ధ్వజం

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ పార్టీ భూ అక్రమాలు మరియు 22A నిబంధనల దుర్వినియోగంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.

కాంగ్రెస్, BRSలపై ఫైర్ అయిన బీజేపీ నేత రామచందర్ రావు

రాష్ట్రంలో కాంగ్రెస్, BRS పార్టీలు ప్రజా సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసి, వీధి నాటకాలు ఆడుతున్నాయని బీజేపీ నేత ఎన్. రామచందర్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పబ్లిసిటీ కోసమే ఆ రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని, వారి వైఖరిని చూసి తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.

కొండా సురేఖను బీఆర్‌ఎస్‌లోకి రానివ్వం: జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ నాయకురాలు, మంత్రి కొండా సురేఖను బీఆర్‌ఎస్ పార్టీలోకి చేర్చుకునే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. కొండా సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వబోమని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.