ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించింది.
ఈ నెల 23వ తేదీ లోపు ముసాయిదా జాబితాను సిద్ధం చేసి విడుదల చేసే అవకాశం ఉంది. అధికారులు వేగంగా అడుగులు వేస్తుండటంతో, వచ్చే నెల (మే) లోనే ఎన్నికలు నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయి.
గతేడాది జూన్తోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీకాలం ముగిసింది. ఇటీవలే రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు కూడా ముగిసిన విషయం తెలిసిందే.


