HomeEntertainmentబంగారం లాంటి భార్య కు విడాకులు ఇచ్చి..ఇంకో పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరో..!

బంగారం లాంటి భార్య కు విడాకులు ఇచ్చి..ఇంకో పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరో..!

Published on

spot_img

బంగారం లాంటి భార్య కు విడాకులు ఇచ్చి..ఇంకో పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరో :

బాలీవుడ్ స్టార్ హీరో “మిస్టర్ పర్ఫెక్ట్” గా గుర్తింపు పొందిన ఆమిర్ ఖాన్ మరోసారి తన వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచారు. సినీ వర్గాలల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం అమీర్ ఖాన్ తన భాగస్వామి గౌరీ స్ప్రాట్‌ను జూలై 5న వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తుంది. ఈ వేడుక ముంబైలోని ఆయన నివాసంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో సాధారణంగా నిర్వహించే రిజిస్టర్ మ్యారేజ్ రూపంలో జరగనున్నట్లు సమాచారం.

ఇటీవల తమ బంధాన్ని అధికారికంగా మార్చుకోవాలని అమీర్ ఖాన్, గౌరీ నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహ ఏర్పాట్లు కూడా ప్రారంభమైనట్లు వారి సన్నిహిత వర్గాలు వెల్లడించినట్లు బాలీవుడ్ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ వివాహంపై అమీర్ ఖాన్ లేదా ఆయన కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికార ప్రకటన వెలువడలేదు. అమీర్ ఖాన్ వ్యక్తిగత జీవితాన్ని పరిశీలిస్తే ఇది ఆయనకు మూడో వివాహం కానుంది.

గతంలో రీనా దత్తాని వివాహం చేసుకున్న ఆమిర్‌కు జునైద్ ఖాన్, ఇరా ఖాన్ అనే ఇద్దరు సంతానం ఉన్నారు. అనంతరం ప్రముఖ దర్శకురాలు కిరణ్ రావును వివాహం చేసుకున్న ఆయనకు ఆజాద్ రావు ఖాన్ అనే కుమారుడు జన్మించాడు. అయితే ఆమిర్, కిరణ్ రావు 2021లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. ఇక గౌరీ స్ప్రాట్‌ విషయానికి వస్తే ఆమెకు గత వివాహం ద్వారా క్వీన్ అనే కుమారుడు ఉన్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ జంట తమ కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు బాలీవుడ్ వర్గాలలో చర్చ జరుగుతుంది. జూలై 5న వివాహం జరగబోతున్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. అయితే దీనిపై సోషల్ మీడియాలో అప్పుడే ట్రోలింగ్ ప్రారంభమైంది. బంగారం లాంటి భార్యకు విడాకులు ఇచ్చేసి మరో వివాహం చేసుకుంటున్నావా..? అంటూ అమీర్ ఖాన్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు ఆకతాయిలు.

Latest articles

అమెరికాలో భారీ గణేష్ వేడుకలు వద్దు..NRIలకు కీలక సూచనలు!

అమెరికాలో వినాయక చవితి వేడుకల నేపథ్యంలో ప్రవాస భారతీయులకు కీలక సూచనలు వెలువడ్డాయి. బహిరంగ ప్రదేశాల్లో భారీగా వేడుకలు నిర్వహించకుండా ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని కమ్యూనిటీ పెద్దలు కోరుతున్నారు

అర్హత లేని టీచర్ల నియామకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం!

అర్హతలు లేని టీచర్ల నియామకాలు, కొనసాగింపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. RTE, NCTE, UGC నిబంధనల ప్రకారం నిర్దేశిత అర్హతలు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది

తెలంగాణలో దసరా సెలవులు ఎప్పట్నుంచి? పూర్తి వివరాలు ఇవే!

తెలంగాణలో ఈసారి దసరా సెలవులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? ఎన్ని రోజులు ఉంటాయి? పాఠశాలలకు సెలవుల తేదీలు, పునఃప్రారంభ తేదీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోండి.

నందు సడెన్ ఎంట్రీ వెనుక పెద్ద స్కెచ్? బిగ్‌బాస్ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ నిజమేనా..?

నందు సడెన్‌గా ఇండియాకు రావడం, హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వెంటనే పోలీసుల అదుపులోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అసలు ఆమె ఎంట్రీ వెనుక ఏదైనా స్కెచ్ ఉందా? బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం నిజమేనా అనే చర్చ జోరుగా సాగుతోంది.
spot_img

Related Articles

నందు సడెన్ ఎంట్రీ వెనుక పెద్ద స్కెచ్? బిగ్‌బాస్ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ నిజమేనా..?

నందు సడెన్‌గా ఇండియాకు రావడం, హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వెంటనే పోలీసుల అదుపులోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అసలు ఆమె ఎంట్రీ వెనుక ఏదైనా స్కెచ్ ఉందా? బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం నిజమేనా అనే చర్చ జోరుగా సాగుతోంది.

హీరో జయం రవితో కెనీషా అలా..పరసనల్ వీడియో లీక్..!

హీరో జయం రవి, కెనీషాకు సంబంధించినదిగా ప్రచారం జరుగుతున్న ఓ పర్సనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది.

వార్నీ..మోక్షజ్ఞ డెబ్యూ ఛాన్స్ వశిష్టకి బాలయ్య ఇచ్చింది ఇందుకా..?

మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వశిష్ట దర్శకత్వంలో మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే అవకాశం ఉందనే వార్తలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. అసలు బాలయ్య ఈ ఛాన్స్ వశిష్టకే ఇవ్వడం వెనుక కారణమేంటన్నది ఆసక్తిని పెంచుతోంది.