వరంగల్ ఎంజీఎం (MGM) ఆస్పత్రిలోని ఈఎన్‌టీ (ENT) విభాగం సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ. 54.44 లక్షల నష్టం వాటిల్లింది. 2025 ఏప్రిల్ 1 నుండి 2026 మార్చి 31 వరకు జరిగిన శస్త్రచికిత్సలకు సంబంధించిన వివరాలను ఆరోగ్యశ్రీ పోర్టల్‌లో సక్రమంగా అప్‌డేట్ చేయకపోవడమే ఇందుకు కారణం.
మొత్తం 114 కేసుల్లో డిశ్చార్జ్ వివరాలు, 55 సర్జరీల అప్‌డేట్స్, మరియు 104 కేసుల్లో మెడికోల నమోదు చేయకపోవడంతో ఈ భారీ నిధులు ఆగిపోయాయి. వైద్యులు, సిబ్బంది సమన్వయ లోపం వల్లే ఆరోగ్యశ్రీ నిధులు కోల్పోవాల్సి వచ్చిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


