స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం
తేది: 03-02-2026
అభ్యర్థుల చేతికి ‘బీ-ఫామ్’ అందజేసిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారు
బీ-ఫామ్‌లు అందజేసి.. అభ్యర్థులకు దిశానిర్దేశం చేసిన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోలేనిది
మున్సిపాలిటీ బాధ్యతను నేను స్వయంగా తీసుకుంటున్నాను
ఘనపూర్ మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుదాం
మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపే ద్యేయంగా పని చేయాలి
నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారి ఏకైక లక్ష్యం
మున్సిపాలిటీ పరిధిలోని 18కి 18 వార్డుల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి
౼ వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య

స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు మంగళవారం స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో అభ్యర్థుల చేతికి బీ-ఫామ్ లు అందజేశారు.
బీ-ఫామ్‌లు అందుకున్న అభ్యర్థులు వెంటనే ఎన్నికల అధికారులకు బి-ఫామ్ సమర్పించాలని ఎంపీ సూచించారు.
అధికారికంగా పార్టీ తరఫున బీ-ఫామ్‌లు అందాయని పేర్కొన్న ఎంపీ, ప్రభుత్వ ప్రజారంజక పాలన, అమలవుతున్న గ్యారంటీలను ఇంటింటికీ తీసుకెళ్లి ఓటర్ల ఆశీస్సులు పొందాలని పిలుపునిచ్చారు.
వార్డుల వారీగా కార్యకర్తలను సమన్వయం చేసుకుని ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయాలని, ప్రత్యర్థుల వ్యూహాలను సమర్థంగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేశారు.
స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీలోని 18 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులే గెలుపు సాధిస్తారని ఎంపీ డాక్టర్ కడియం కావ్య ధీమా వ్యక్తం చేశారు.
అనంతరంఏర్పాటుచేసినమీడియాసమావేశంలోవరంగల్పార్లమెంట్సభ్యురాలుడాక్టర్కడియంకావ్యమాట్లాడుతూ, మున్సిపాలిటీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన గ్యారంటీ పథకాలు ప్రజల్లో విశేష ఆదరణ పొందుతున్నాయని పేర్కొన్నారు.
పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు తమ పార్టీ కట్టుబడి ఉందని, మున్సిపాలిటీ ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఎంపీ కోరారు.
గత పాలకులు స్టేషన్ ఘనపూర్‌ను మున్సిపాలిటీ చేస్తానని గత ఎమ్మెల్యే మాటలు చెప్పడమే తప్ప ఏమీ చేయలేదని విమర్శించారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాతే స్టేషన్ ఘనపూర్‌ను మున్సిపాలిటీగా ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.
స్టేషన్ ఘనపూర్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు అహర్నిశలు కృషి చేస్తున్నారని వెల్లడించారు.
స్టేషన్ ఘనపూర్ లో జరుగుతున్న అభివృద్ధిని చూసే ప్రజలు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
గతంలో వర్షం పడితే స్టేషన్ ఘనపూర్ వరదమయంగా మారేదని, ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేకుండా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీలో ఇప్పటికే రూ.50 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించారని చెప్పారు.
మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత మరో రూ.50 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని ప్రకటించారు.
స్టేషన్ ఘనపూర్‌ను ఒక మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుదామని అన్నారు. శివునిపల్లి చాగల్, ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఈ మున్సిపాలిటీ గెలుపు బాధ్యతను తానే తీసుకుంటానని అభ్యర్థుల గెలుపు కోసం మనందరం కలిసి పని చేద్దామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా చేసుకొని పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే మున్సిపాలిటీకి వచ్చే నిధులు సక్రమంగా వినియోగించుకోవచ్చని అన్నారు.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోలేనిదని, నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నామని తెలిపారు.
మున్సిపాలిటీలోని 18కి 18 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో సాగునీరు, విద్య, వైద్య, వ్యవసాయం, విద్యుత్ రంగాల అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు నిరంతరం కృషి చేస్తున్నారని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య తెలిపారు.
గత 15 ఏళ్లుగా అభివృద్ధికి దూరంగా ఉన్న స్టేషన్‌ఘనపూర్ నియోజకవర్గాన్ని సమగ్ర అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యధికంగా స్టేషన్‌ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.1400 కోట్ల నిధులు తీసుకువచ్చిన ఘనత ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికే దక్కిందన్నారు.
దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు రెండు పంటలకు సాగునీరు అందిస్తున్నామని తెలిపారు.
దాదాపు రూ.400 కోట్ల వ్యయంతో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
నియోజకవర్గ పరిధిలోని గురుకుల పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని చెప్పారు.
ఇటీవల యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించినట్లు తెలిపారు.
నియోజకవర్గ కేంద్రంలో రూ.45.50 కోట్లతో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం జరుగుతోందన్నారు.
రైతులు ఎదుర్కొంటున్న లో వోల్టేజ్ సమస్యను 8 సబ్‌స్టేషన్ల నిర్మాణం ద్వారా పరిష్కరించామని పేర్కొన్నారు.
ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తూ గ్రామాలలో అంతర్గత రహదారులు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణంతో పాటు అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు.
అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లను అందజేశామని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఎస్‌డీఎఫ్, ఈజీఎస్, ఎంపీ నిధులతో దాదాపు రూ.35 కోట్ల వ్యయంతో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాళ్లు, గ్రామ పంచాయితీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించడం జరిగిందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు పలు దఫాలుగా నిర్వహించిన సర్వేలు, టీపీసీసీ సర్వేల నివేదికల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేశామని తెలిపారు.
పార్టీ తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని, అభ్యర్థుల గెలుపు కోసం సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
టికెట్ ఆశించి అవకాశం దక్కని ఆశావాహులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో పార్టీ వారికి మరిన్ని అవకాశాలు కల్పిస్తుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


