వరంగల్ : నగరంలోని చారిత్రక భద్రకాళి దేవాలయాన్ని ప్రముఖ సినీ నటుడు, ‘బలగం’ ఫేమ్ రచ్చ రవి బుధవారం సందర్శించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు సాదరంగా స్వాగతం పలికారు. రవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
వరంగల్ వాసిగా ఇక్కడ జన్మించడం తన అదృష్టమని భావిస్తున్నట్లు తెలిపారు. భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ తనపై ఉంటాయని, ఇక్కడికి రావడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు. ‘బలగం’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రవిని చూసేందుకు స్థానిక భక్తులు, అభిమానులు ఆసక్తి చూపారు. ఆలయ ఆవరణలో ఆయనతో ఫోటోలు దిగేందుకు పలువురు ఉత్సాహం ప్రదర్శించారు.


