హన్మకొండ: ముందస్తు బుకింగ్ పేరుతో అపార్ట్‌మెంట్ కొనుగోలు చేయిస్తామని నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేసిన నిందితుడిని హన్మకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.
హన్మకొండ సీఐ మచ్చ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం, బాలాజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో సోలిపేట ప్రభాకర్ రెడ్డి మరియు కోడూరు లక్ష్మీ కలిసి SVB వైభవ్ ప్రాజెక్ట్ పేరుతో ఏడు అంతస్తుల భవనంలో 164 అపార్ట్‌మెంట్‌లు నిర్మిస్తున్నామని ప్రజలను నమ్మించారు. ముందుగా బుకింగ్ చేసుకుంటే తక్కువ ధరకు ఫ్లాట్ ఇస్తామని చెప్పి పలువురిని ఆకర్షించారు.
ఈ క్రమంలో హన్మకొండలోని ఏనుగుల గడ్డకు చెందిన బందెల్లి స్వర్ణ అనే మహిళ వద్ద నుంచి రూ.81 లక్షలు వసూలు చేసి మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం అతడిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ మచ్చ శివకుమార్ తెలిపారు.


