వరి కోయ్యలు కాల్చడం వల్ల ఏమవుతుంది?
కోయ్యలు కాల్చడం వల్ల మట్టిలోని పోషకాలు నశిస్తాయి. భూసారం తగ్గుతుంది. సూక్ష్మజీవులు చనిపోతాయి. పర్యావరణ కాలుష్యం కూడా పెరుగుతుంది.
వరి గడ్డిని కాల్చకుండా ఏం చేయాలి?
వరి గడ్డిని యంత్రాలతో చిన్న ముక్కలుగా చేసి పొలంలో కలియదున్నాలి.
వేస్ట్ డీకంపోజర్ లేదా సూపర్ ఫాస్ఫేట్ వాడితే అది సహజ ఎరువుగా మారుతుంది.
సాధారణంగా చాలామంది రైతులు వరి కోతల ముగిసిన తర్వాత పొలాలల్లో మిగిలిపోయే వరి కోయ్యలను, గడ్డిని దహనం చేయడం మనం చూస్తూనే ఉంటాం.
అయితే దానివల్ల భూమికి, పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని శాస్త్రవేత్తలు అలాగే వ్యవసాయ అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రైతులు అవగాహన లేకుండా చేసే చిన్న చిన్న తప్పులు వల్ల భవిష్యత్తులో పెద్ద నష్టాలకే దారితీస్తుంది అంటూ హెచ్చరిస్తున్నారు.
పంట వ్యర్ధాలను కాల్చడం వల్ల మట్టిలోని తేమ మొత్తం ఆవిరి అయిపోతుంది అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .

అంతేకాకుండా భూమికి అవసరమైన సేంద్రియ కార్బన్, నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు మంటలలో కాలిపోయి అవి వృధాగా ఆవిరైపోతాయి అంటున్నారు.
మంటల వేడికి భూమిపై పొరల్లో ఉండే పంటకు మేలు చేసే ఎన్నో సూక్ష్మజీవులు వానపాములు మరణిస్తాయి అంటున్నారు.
అంతేకాదు పొలంలో తిరిగే పాములు, ముంగిసలు, ఉడుములు పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయి.
ఇలా పంట వ్యర్థాలను కాల్చడం వల్ల మేలు చేసే జీవరాసులు సైతం కాలి బూడిదవుతాయి అంటూ హెచ్చరిస్తున్నారు.
దీని వల్ల నేల గట్టిపడి తదుపరి పంట వేయడానికి భూమి దున్నడం ఇంకా ఇంకా కష్టంగా మారుతుంది అంటున్నారు.
వ్యవసాయంలో పర్యావరణ హిత పద్ధతులతో రైతులకు లాభాలు:
అంతేకాదు రైతులు వరి కొయ్యలను కాల్చకుండా వ్యవసాయ యంత్రాలతో వాటిని చిన్న ముక్కలుగా చేసేసి..
ఆ తర్వాత పొలంలో నీరు పెట్టి ట్రాక్టర్ లేదా కేన్ విల్ చక్రాలతో కలియదున్నాలి అంటూ సూచిస్తున్నారు.
దీనికి ఎకరాకు 50 కేజీల సింగిల్ సూపర్ పాస్ఫేట్ లేదా వేస్ట్ డీకంపోజర్ ని వాడితే అది రెండు మూడు వారాలలో వరికోయ్యలు కుళ్లిపోయేలా చేసి..
ఎకరానికి దాదాపు టన్ను వరకు అత్యంత విలువైన సేంద్రియ ఎరువుగా తయారవుతుంది అంటూ సలహా ఇస్తున్నారు .
ఇలా చేయడం వల్ల ఉపయోగాలు:
అంతేకాదు దీనివల్ల తదుపరి పంట దిగుపతి 5% నుండి 10% వరకు పెరిగే అవకాశం ఉంది అంటూ కూడా వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
అంతేకాదు నిజానికి వరి కోయ్యలను పొలాల్లో తగలబెట్టడం నేరం.
నిబంధనలను ఉల్లంఘిస్తే ప్రభుత్వ పరంగా చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది అంటూ హెచ్చరిస్తున్నారు.
ఆ కారణంగా రైతులు వరి మాగిళ్లను కాల్చడం మానేసి పర్యావరణానికి ఎంతో మేలు చేసే విధంగా భూమిలోనే కలియదున్ని భూసారాన్ని పెంచుకోవాలి అని సూచిస్తున్నారు.

వరంగల్ జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఫాలో అయ్యే పద్ధతి ఇదే :
వరంగల్ జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారు.
పంట కోత అనంతరం వరి కొయ్యలను కాల్చివేయకుండా, వాటిని సేంద్రియ ఎరువులుగా వినియోగించే దిశగా ముందడుగు వేస్తున్నారు.
కొంతమంది రైతులు వరి అవశేషాలతో బయోగ్యాస్ తయారీ, పశుగ్రాసం నిల్వ వంటి వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు.
ప్రభుత్వం కూడా యంత్రాల సబ్సిడీల ద్వారా రైతులను ప్రోత్సహిస్తోంది.
“పొలాల్లో కొయ్యలను కాల్చకుండా భూమిలో కలపడం వల్ల నేల సారం పెరిగింది. ఖర్చులు తగ్గి దిగుబడి మెరుగుపడింది” అని స్థానిక రైతులు తెలిపారు.
రైతులు సంప్రదాయ పద్ధతులకు బదులుగా శాస్త్రీయ విధానాలు అనుసరిస్తే పర్యావరణ పరిరక్షణతో పాటు ఆర్థిక లాభాలు కూడా సాధ్యమవుతాయి.
FAQ’s
1. వరి గడ్డి కాల్చడం వల్ల భూమికి నష్టం జరుగుతుందా?
అవును. మట్టిలోని పోషకాలు తగ్గిపోవడంతో భూసారం దెబ్బతింటుంది.
2. వరి మాగిళ్లను ఎలా ఉపయోగించాలి?
వాటిని పొలంలో కలియదున్ని సహజ ఎరువుగా మార్చుకోవచ్చు.
3. వేస్ట్ డీకంపోజర్ ఉపయోగం ఏమిటి?
పంట వ్యర్థాలు త్వరగా కుళ్లిపోయి సేంద్రియ ఎరువుగా మారడానికి సహాయపడుతుంది.
4. పంట వ్యర్థాలను కాల్చితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా?
అవును. పర్యావరణ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
5. వరి అవశేషాలు కలియదున్నడం వల్ల లాభమేమిటి?
భూసారం పెరిగి తదుపరి పంట దిగుబడి మెరుగుపడుతుంది.
Read Warangal News and Latest Politics News and Real Estate


