సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ వైరల్ అవుతూనే ఉంటాయి. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో 1980ల నాటి క్లాసిక్ పోర్ట్రెయిట్ల తరహాలో ఫొటోలను మార్చుకునే ట్రెండ్ బాగా హల్చల్ చేస్తోంది. సాధారణ ఫొటోలను ChatGPT వంటి AI టూల్స్‌కు ఇచ్చి, పాతకాలపు హెయిర్‌స్టైల్, దుస్తులు, వార్మ్ లైటింగ్, ఫిల్మ్ గ్రెయిన్ ఎఫెక్ట్‌తో వింటేజ్ లుక్‌లోకి మార్చుకుంటున్నారు.
ఫొటోలతో పాటు వ్యక్తిగత సమాచారం కూడా..:
AI రూపొందించే ఫొటోలు సహజంగా కనిపించడంతో ఈ ట్రెండ్‌కు భారీగా ఆదరణ లభిస్తోంది. అయితే ఫొటోను AI ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేసినప్పుడు కేవలం చిత్రం మాత్రమే కాకుండా వ్యక్తిగత సమాచారం కూడా సంబంధితంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని ఫొటోల్లో మెటాడేటా ద్వారా తీసిన సమయం, పరికరం, లొకేషన్ వంటి వివరాలు ఉండొచ్చు. అలాగే బ్యాక్‌గ్రౌండ్‌లోని ఇల్లు, వాహన నంబర్ ప్లేట్, సైన్‌బోర్డులు, ఇతర వ్యక్తులు కూడా కనిపించవచ్చు.
ప్రైవసీ కోసం ఈ జాగ్రత్తలు..:
ప్రైవేట్ ఫొటోలను AIకి ఇచ్చే ముందు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ChatGPTలో Settings > Data Controls ద్వారా “Improve the model for everyone” ఆప్షన్‌ను ఆఫ్ చేయవచ్చు. అవసరమైతే Temporary Chatను ఉపయోగించవచ్చు. గుర్తింపు కార్డులు, వ్యక్తిగత పత్రాలు, అత్యంత ప్రైవేట్ ఫొటోలను AI ప్లాట్‌ఫామ్‌లలో అప్లోడ్ చేయకపోవడమే సురక్షితం. ఇతరుల, ముఖ్యంగా పిల్లల ఫొటోలను వారి అనుమతి లేకుండా ఉపయోగించకపోవడం మంచిది. అలాగే ఫొటో అప్లోడ్ చేసే ముందు బ్యాక్‌గ్రౌండ్‌లోని సున్నితమైన వివరాలను క్రాప్ చేయడం లేదా బ్లర్ చేయడం ద్వారా ప్రైవసీ రిస్క్‌ను తగ్గించవచ్చు.


