వరంగల్ జిల్లా:
వర్ధన్నపేట నియోజకవర్గంలో ప్రవహించే ఆకేరువాగు ప్రాంత ప్రజల జీవనోపాధిపై కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు.

ఆకేరువాగు ఐనవోలు, వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల మీదుగా ప్రవహిస్తూ మహబూబాబాద్ వైపు వెళ్లి చివరకు గోదావరిలో కలుస్తుందని తెలిపారు. ఈ వాగులో సహజంగా ఇసుక ఎక్కువగా ఉండదని, అయితే వర్షాకాలంలో వాగు పరిసరాల్లోని పొలాల్లో పేరుకుపోయే మట్టి, ఇసుక మిశ్రమాన్ని ఫిల్టర్ చేసి విక్రయించడం ద్వారా స్థానికులు జీవనోపాధి పొందుతున్నారని చెప్పారు.
👉 ఈ ప్రక్రియపై సుమారు 5,000 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి
👉 ముఖ్యంగా దళితులు, ఎస్టీలు, బీసీలు ఈ పనిపై ఆధారపడుతున్నారు
👉 ఫైనాన్స్ ద్వారా ట్రాక్టర్లు తీసుకొని ఇసుకను విక్రయిస్తూ జీవిస్తున్నారు
ఈ ఫిల్టర్ చేసిన ఇసుకను ఇళ్ల నిర్మాణానికి కాకుండా,
టైల్స్ కింద వేయడానికి బాత్రూమ్ నిర్మాణాలకు ఇతర చిన్నపనులకు వినియోగిస్తారని వివరించారు
ఒక ట్రాక్టర్ ఇసుకను అమ్మితే సుమారు ₹1000 వరకు ఆదాయం వస్తుందని తెలిపారు.
ప్రస్తుతం ఎదురవుతున్న సమస్య
ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఇసుక విధానంలో ఈ ఫిల్టర్ ఇసుక కార్యకలాపాలు చేర్చబడలేదని, దీంతో వేలాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. ఉపాధి కోల్పోయిన ప్రజలు రోడ్లపై ధర్నాలు నిర్వహిస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వానికి విజ్ఞప్తి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రత్యేక చొరవ తీసుకొని:
గ్రామపంచాయతీ ద్వారా రాయల్టీ చెల్లించే విధానం తీసుకురావాలని ప్రజలు తమ సొంత భూముల్లోనే ఫిల్టర్ చేసి విక్రయించుకునేలా అనుమతించాలని
ఇలా చేస్తే:
✔️ గ్రామపంచాయతీలకు ఆదాయం పెరుగుతుంది
✔️ 5,000 కుటుంబాలకు ఉపాధి తిరిగి లభిస్తుంది
ఈ అంశంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే కోరారు.


