హనుమకొండ జిల్లా | బ్రేకింగ్
అక్షర చిట్ ఫండ్స్ డైరెక్టర్ పేరాల శ్రీవిద్యను సుబేదారి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 2022లో “సుబేదారి పోలీస్ స్టేషన్”,(hanamkonda telangana) లో నమోదైన కేసులో ఆమెపై విచారణ కొనసాగుతుండగా, పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నట్లు సమాచారం.
బెంగళూరు నుండి అమెరికాకు వెళ్లనున్నారన్న సమాచారం మేరకు పోలీసులు ప్రత్యేక బృందంతో పథకం ప్రకారం కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హనుమకొండకు తరలించి నిన్న రాత్రి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.
కోర్టు ఆదేశాల మేరకు ఆమెకు రిమాండ్ విధించగా, నర్సంపేట సబ్ జైల్‌కు తరలించారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


