పండగ సీజన్ నేపథ్యంలో ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 సేల్‌కు తేదీ ఖరారైంది. అమెజాన్ ప్రకటించిన వివరాల ప్రకారం ఈ ఏడాది ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 8 నుంచి ప్రారంభం కానుంది. మరో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ అక్టోబర్ 9 నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ప్రారంభించనున్న నేపథ్యంలో అమెజాన్ ఒక రోజు ముందుగానే సేల్‌ను మొదలుపెడుతోంది.
ఎస్‌బీఐ కార్డులతో 10% డిస్కౌంట్ :
ఈ సేల్‌లో ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసే కస్టమర్లకు 10 శాతం తక్షణ డిస్కౌంట్ అందించనున్నారు. ఈఎంఐ లావాదేవీలకు కూడా ఈ ఆఫర్ వర్తించనుంది. ప్రైమ్ సభ్యులకు ఎంపిక చేసిన డీల్స్‌పై అదనపు ప్రయోజనాలు లభించనున్నాయి.
అన్ని కేటగిరీల్లో భారీ ఆఫర్లు :
స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, గృహోపకరణాలు, నిత్యావసర వస్తువులపై ప్రత్యేక డిస్కౌంట్లు అందుబాటులో ఉండనున్నాయి. బ్లాక్‌బస్టర్ డీల్స్, టాప్ 100 డీల్స్, మెగా డీల్స్, రాత్రి 8 గంటల ప్రత్యేక ఆఫర్లను కూడా అమెజాన్ అందించనుంది.
ఏఐతో మెరుగైన షాపింగ్ :
ఈసారి కస్టమర్ల షాపింగ్ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు అమెజాన్ ఏఐ ఆధారిత ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఉత్పత్తుల పోలిక, ధరల చరిత్ర, వ్యక్తిగత సిఫార్సులు వంటి అంశాల్లో ఇవి ఉపయోగపడనున్నాయి.
లాజిస్టిక్స్ నెట్‌వర్క్ విస్తరణ :
వేగవంతమైన డెలివరీ కోసం 20 కొత్త ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లు, 6 సార్ట్ సెంటర్లు, 150 లాస్ట్-మైల్ స్టేషన్లను అమెజాన్ ఏర్పాటు చేసింది. దీపావళి నాటికి ‘అమెజాన్ నౌ’ సేవలను 100 నగరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే సేల్ ఎప్పటివరకు కొనసాగుతుందనే విషయాన్ని సంస్థ ఇంకా వెల్లడించలేదు.


