HomeLatest Newsఅమెరికాలో భారీ గణేష్ వేడుకలు వద్దు..NRIలకు కీలక సూచనలు!

అమెరికాలో భారీ గణేష్ వేడుకలు వద్దు..NRIలకు కీలక సూచనలు!

Published on

spot_img

వినాయక చవితి పండుగకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అమెరికాలోని ప్రవాస భారతీయులకు కమ్యూనిటీ పెద్దల నుంచి కీలక సూచనలు వెలువడుతున్నాయి. పండుగ వేడుకలను బహిరంగ ప్రదేశాల్లో భారీగా నిర్వహించకుండా ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా జరుపుకోవాలని సూచిస్తూ ఎన్ఆర్ఐ గ్రూపుల్లో సందేశాలు వైరల్ అవుతున్నాయి.

బహిరంగ వేడుకలకు దూరంగా ఉండాలని సూచన:

అపార్ట్‌మెంట్లు, కాలనీలు, రోడ్లు లేదా ఇతర పబ్లిక్ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో గుమిగూడి వేడుకలు నిర్వహించవద్దని సూచించారు. ఎవరైనా వేడుకలకు ఆహ్వానిస్తే.. తాము ఇంట్లోనే పండుగ జరుపుకుంటామని సున్నితంగా చెప్పాలని కోరారు. భారీ మండపాలు ఏర్పాటు చేయడం, పెద్ద శబ్దాలతో కార్యక్రమాలు నిర్వహించడం, రోడ్లపై రద్దీ సృష్టించడం వంటి వాటికి దూరంగా ఉండాలని పేర్కొన్నారు.

సోషల్ మీడియా పోస్టులపైనా సూచనలు:

కంటెంట్ క్రియేటర్లు కూడా వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, గ్రూప్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. రోడ్డు పక్కన జరిగే కార్యక్రమాలను ఆన్‌లైన్‌లో షేర్ చేయకూడదని, నదులు లేదా జలాశయాల్లో నిమజ్జనం వంటి బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కోరారు.

వ్యతిరేకత పెరుగుతుందనే ఆందోళన :

అమెరికాలో భారతీయులపై కొన్ని వర్గాల్లో వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ఈ సూచనలు వచ్చినట్లు తెలుస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో నిబంధనలకు విరుద్ధంగా జరిగే కార్యక్రమాలు స్థానికులతో వివాదాలకు దారితీసే అవకాశం ఉందని కమ్యూనిటీ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కార్లోస్ టూర్సియోస్ వివాదాస్పద పోస్ట్ :

ఇటీవల టెక్సాస్‌కు చెందిన కన్జర్వేటివ్ కార్యకర్త కార్లోస్ టూర్సియోస్ షుగర్ ల్యాండ్‌లోని శ్రీ అష్టలక్ష్మి ఆలయానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వివాదానికి దారితీసింది. భారతీయుల వలసను విమర్శిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర చర్చకు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో స్థానిక నిబంధనలు పాటిస్తూ శాంతియుతంగా పండుగ జరుపుకోవాలని ఎన్ఆర్ఐ కమ్యూనిటీ పెద్దలు సూచిస్తున్నారు

Latest articles

NH-563పై అండర్‌పాస్‌ కోసం నిరసన.. ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామస్థుల డిమాండ్

ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామం వద్ద NH-563పై అండర్‌పాస్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు, రైతులు, యువకులు రాస్తారోకో చేపట్టారు.

ప్రయాణికుల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత

మహిళలు, ప్రయాణికుల భద్రతకు మరింత భరోసా కల్పించే లక్ష్యంతో రూపొందించిన “అభయ–మై ట్యాక్సీ సేఫ్” యాప్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, IPS ప్రారంభించారు.

కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు: సీఈసీ జ్ఞానేష్ కుమార్ వ్యవహారంపై కీలక విచారణ

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బహుళ సభ్యుల కమిషన్‌లో నిర్ణయాలు ఏకాభిప్రాయం లేదా మెజారిటీ మేరకే జరగాలని స్పష్టం చేస్తూ, ఈసీఐ, కేంద్ర ప్రభుత్వానికి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

GWMC ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్

GWMC ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.
spot_img

Related Articles

NH-563పై అండర్‌పాస్‌ కోసం నిరసన.. ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామస్థుల డిమాండ్

ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామం వద్ద NH-563పై అండర్‌పాస్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు, రైతులు, యువకులు రాస్తారోకో చేపట్టారు.

కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు: సీఈసీ జ్ఞానేష్ కుమార్ వ్యవహారంపై కీలక విచారణ

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బహుళ సభ్యుల కమిషన్‌లో నిర్ణయాలు ఏకాభిప్రాయం లేదా మెజారిటీ మేరకే జరగాలని స్పష్టం చేస్తూ, ఈసీఐ, కేంద్ర ప్రభుత్వానికి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

రామప్ప చెంత ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటుపై కేటీఆర్ ఆగ్రహం: పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిక

ప్రపంచ ప్రఖ్యాత రామప్ప దేవాలయానికి అతి సమీపంలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధపడటం అత్యంత దారుణమని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్' ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.