HomeWarangal Newsస్టేషన్ ఘనపూర్‌లో అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ

స్టేషన్ ఘనపూర్‌లో అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ

Published on

spot_img

స్టేషన్ ఘనపూర్ | తేదీ: 08-04-2026

ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణంలో అంగన్వాడీ కేంద్రాల పాత్ర కీలకమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరియు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పేర్కొన్నారు.

అంగన్వాడీ టీచర్ల పనితీరును మెరుగుపరచడం, సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు ఆధునిక సాంకేతికతతో కూడిన స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

Kadiyam SriHari

స్టేషన్ ఘనపూర్ పట్టణంలోని ఎస్ కన్వెన్షన్‌లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. ముఖ్య అతిథులుగా హాజరైన ప్రజాప్రతినిధులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ, అంగన్వాడీ వ్యవస్థను ఆధునికీకరించే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని అన్నారు. స్మార్ట్ ఫోన్ల వినియోగంతో పేపర్ వర్క్ తగ్గి, సేవలు వేగవంతం అవుతాయని పేర్కొన్నారు.

Kadiyam Kavya

మహిళలు డిజిటల్ వినియోగంలో వెనుకబడి ఉన్న నేపథ్యంలో ఈ చర్య డిజిటల్ గ్యాప్‌ను తగ్గించడంలో సహాయపడుతుందని చెప్పారు. తల్లి–శిశు సంక్షేమంలో అంగన్వాడీ కేంద్రాల పాత్ర కీలకమని, చిన్నారుల ఆరోగ్యం, పోషణ, మానసిక అభివృద్ధిలో టీచర్ల పాత్ర ఎంతో ముఖ్యమని తెలిపారు.

Smartphone Distribution

ఆటిజం వంటి సమస్యలను ముందుగానే గుర్తించడంలో అంగన్వాడీ సిబ్బంది కీలకమని పేర్కొన్నారు. చిన్నారుల రక్షణ కోసం “గుడ్ టచ్ – బ్యాడ్ టచ్” వంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.

మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని, ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. డిజిటల్ టెక్నాలజీ ద్వారా అంగన్వాడీ సేవలు మరింత పారదర్శకంగా మారుతాయని, లబ్ధిదారులకు నాణ్యమైన సేవలు అందించగలుగుతామని తెలిపారు.

Kadiyam Kavya

ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ, పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో అంగన్వాడీల పాత్ర కీలకమని అన్నారు. నియోజకవర్గంలో మొత్తం 349 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని, అందులో 108 కేంద్రాలకు స్వంత భవనాలు లేవని తెలిపారు.

ఈ కేంద్రాలకు నెల రోజుల్లో భవనాలు మంజూరు చేసి, ఏడాది లోపు నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 100 శాతం అంగన్వాడీ కేంద్రాలకు స్వంత భవనాలు నిర్మించి నియోజకవర్గాన్ని రాష్ట్రానికి ఆదర్శంగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

Anganwadi Teachers

అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ-స్కూల్స్ ఏర్పాటు చేసి ఇంగ్లీష్ మీడియం బోధన అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

పిల్లలను స్వంత బిడ్డలుగా చూసుకుంటూ వారి ఆరోగ్యం, అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని టీచర్లకు సూచించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

Latest articles

AI 80’s ఫోటో ట్రెండ్‌పై నిపుణుల హెచ్చరిక.. ఫోటోలు అప్‌లోడ్ చేసే ముందు జాగ్రత్త!

AI టూల్స్‌తో 1980ల నాటి ఫోటోల తరహాలో చిత్రాలను మార్చుకునే ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే వ్యక్తిగత ఫోటోలను AI ప్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేసే ముందు ప్రైవసీ, డేటా భద్రతపై జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బిగ్ బాస్ హోస్టుల రెమ్యునరేషన్.. ఒక్కో సీజన్‌కు కోట్లలో పారితోషికం!

బిగ్ బాస్ షోకు హోస్టులుగా వ్యవహరించిన ప్రముఖ నటులు, సెలబ్రిటీలకు భారీగా పారితోషికం అందినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కో సీజన్‌కు ఎవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసుకోవాలంటే ఈ వివరాలు చూడాల్సిందే.

అభిమానం అంటే ఇదే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసిన పనికి ప్రశంసలు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) సామాజిక బాధ్యతలో భాగంగా కీలక కార్యక్రమం చేపట్టింది. హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ నివారణపై దేశవ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది బాలికలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

నిద్రలో పదేపదే మేల్కొంటున్నారా? మీ శరీరం చెప్తుందే ఇదే..!

రాత్రిపూట నిద్రలో పదేపదే మెలకువ రావడానికి ఒత్తిడి, ఆందోళన, కెఫిన్, గది వాతావరణం వంటి కారణాలు ఉండొచ్చు. అయితే గురకతో పాటు శ్వాస ఆగడం, పగటిపూట అధిక నిద్రమత్తు ఉంటే స్లీప్ అప్నియా సంకేతాలు కావచ్చు.
spot_img

Related Articles

వరంగల్‌లో మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ తండ్రి ఆత్మహత్యాయత్నం

మాజీ మంత్రి కొండా సురేఖ వద్ద ఓఎస్డీగా పనిచేసిన సుమంత్ తండ్రి సుబ్రహ్మణ్యం శుక్రవారం ఉదయం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ చొరవతో ప్రమాదకర గుంతల పూడ్చివేత..

నగర పరిధిలోని ఫాతిమా బ్రిడ్జి, అదాలత్ సెంటర్ ప్రధాన రహదారులపై వాహనదారులకు నరకం చూపుతున్న ప్రమాదకర గుంతలను ట్రాఫిక్ సీఐ వెంకన్న తన సొంత చొరవతో పూడ్చివేయించారు.

విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో సడన్‌గా చెలరేగిన మంటలు: సకాలంలో స్పందించి పెను ప్రమాదాన్ని తప్పించిన డెలివరీ బాయ్స్

విద్యుత్‌నగర్‌లోని రోడ్‌ నంబర్‌ 1 సమీపంలో ఒక భారీ ప్రమాదం తృప్తిలో తప్పింది. గురువారం రోజున అక్కడ ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ సంభవించి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.