HomeWarangal Newsవరంగల్‌లో కొనసాగుతున్న విషాదాలు: పురుగుల మందు తాగి మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

వరంగల్‌లో కొనసాగుతున్న విషాదాలు: పురుగుల మందు తాగి మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

Published on

spot_img

హనుమకొండ/భూపాలపల్లి: వరంగల్ రీజియన్ పరిధిలో ఆర్టీసీ కార్మికుల వరుస ఆత్మహత్యాయత్నాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి చెందిన ఘటన మరువకముందే, తాజాగా మరో డ్రైవర్ బలవన్మరణానికి ప్రయత్నించడం ఆందోళన కలిగిస్తోంది.

వరంగల్ రీజియన్, భూపాలపల్లి డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న రవీందర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వంగపాడు గ్రామానికి చెందిన ఆయన గురువారం రాత్రి తన నివాసంలో పురుగుల మందు తాగారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే వరంగల్ ఎంజీఎం (MGM) ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, రవీందర్ ఆత్మహత్యాయత్నానికి కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. అయితే, ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న తరుణంలో, కార్మికులు వరుసగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం తోటి ఉద్యోగుల్లో ఆందోళన నింపుతోంది.

నర్సంపేట డిపోకు చెందిన శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనతో ఇప్పటికే ఆర్టీసీ వర్గాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇప్పుడు రవీందర్ ఘటనతో కార్మికులు మరింత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

కార్మికులు ఎవరూ అధైర్యపడి ప్రాణాలు తీసుకోవద్దని, సమస్యలు చర్చల ద్వారా పరిష్కారమవుతాయని తోటి కార్మికులు కోరుతున్నారు.

​ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఆత్మహత్యాయత్నానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Latest articles

కేయు అధ్యాపకుడు డా. ఎల్. జితేందర్‌కు జాతీయ స్థాయి డిజైన్ పేటెంట్

పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎల్. జితేందర్ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించారు.

ఇంజనీర్ల సేవలు దేశ అభివృద్ధికి కీలకం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల సేవలు అత్యంత కీలకమైనవని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడంలో వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

టీజీఎన్పీడీసీఎల్‌కు రెండు జాతీయ పురస్కారాలు

హనుమకొండ: తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ రెండు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. నక్కలగుట్టలోని సంస్థ...

కేంద్ర పథకాలు వేగంగా అమలు చేయాలి: వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లాలని, అర్హులైన లబ్ధిదారులకు వాటి ప్రయోజనాలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అధికారులను ఆదేశించారు.
spot_img

Related Articles