కాజీపేట ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు రహదారి భద్రతపై ఒక వినూత్నమైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా ‘అరైవ్ అలైవ్’ అనే కార్యక్రమాన్ని చేపట్టారు.
కాజీపేట ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ ధరించని వాహనదారులకు అవగాహన కల్పించడానికి యమధర్మరాజు, చిత్రగుప్తుడి వేషధారణలను ఉపయోగించారు. యమధర్మరాజు స్వయంగా రోడ్డుపై కనిపిస్తూ, నిబంధనలు పాటించకపోతే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించడం ఈ ప్రచారంలో హైలైట్.
అదనపు డీసీపీ ప్రభాకర్ రావుమాట్లాడుతూ, ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు.


