హన్మకొండ: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆశా వర్కర్లు రోడ్డెక్కారు. హన్మకొండ జిల్లా కేంద్రంలోని రాంనగర్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల సంఘం భారీ ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా నిరసనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ గోడును వెళ్లబోసుకున్నారు.
డిమాండ్స్ :-
• ఆశా వర్కర్లకు నెలకు రూ. 18 వేల ఫిక్స్‌డ్ వేతనం అందించాలి.
• గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిలను తక్షణమే విడుదల చేయాలి.
• పెరిగిన పని భారాన్ని తగ్గించి, మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించాలి.
• ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి.
ఆశా వర్కర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని సంఘం నాయకులు హెచ్చరించారు. ఈ నిరసనతో రాంనగర్ పరిసర ప్రాంతాల్లో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.


