స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి శాసనసభ ఎథిక్స్ కమిటీ నోటీసులు జారీ చేసింది.
కడియం శ్రీహరిపై కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు, అలైంగిక/అనైతిక ప్రవర్తనపై వచ్చిన ఫిర్యాదులపై కమిటీ విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 29న ఉదయం 11 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్-1లో ఎథిక్స్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో ఆయనపై వచ్చిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ చేపట్టనున్నారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


