HomeWarangal Newsపంట అవశేషాల దహనంపై అవగాహన.. ప్రచార రథాన్ని ప్రారంభించిన మడికొండ సీఐ

పంట అవశేషాల దహనంపై అవగాహన.. ప్రచార రథాన్ని ప్రారంభించిన మడికొండ సీఐ

Published on

spot_img

పంట అవశేషాల దహనంపై అవగాహన:

హనుమకొండ జిల్లా మడికొండ ప్రాంతంలో రైతులు పంట అవశేషాలను కాల్చకుండా ఉండాలని పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పంట కోతలు అనంతరం పొలాల్లలో మిగిలిపోయే అవశేషాలను తగులబెట్టడం వల్ల అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతుల్లో చైతన్యం కల్పించేందుకు మడికొండ సిఐ పుల్యాల కిషన్ ప్రత్యేక ప్రచార రథాన్ని ప్రారంభించారు.

ఈ ప్రచార రథం గ్రామాల వారీగా తిరుగుతూ పంట అవశేషాల దహనం వల్ల కలిగే నష్టాలను రైతులకు వివరిస్తుంది. పొలాలలో మంటలు వేయడం వల్ల సమీప పంటలు, విద్యుత్ తీగలు, చెట్లు దగ్ధమయ్యే ప్రమాదం ఉందని.. కొన్నిసార్లు ప్రాణ నష్టం కూడా సంభవించే అవకాశాలు ఉంటాయని సిఐ తెలిపారు. అదేవిధంగా పర్యావరణ కాలుష్యం పెరగడంతో పాటు భూమి సారవంతత కూడా తగ్గిపోతుంది అని పేర్కొన్నారు. రైతులు పంట అవశేషాలను కాల్చకుండా వాటిని సేంద్రియ ఎరువులుగా వినియోగించాలని అధికారులు సూచించారు.

ప్రభుత్వ శాఖలు సూచిస్తున్న ఆధునిక పద్ధతులను అనుసరించడం ద్వారా భూమి నాణ్యత మెరుగుపడడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పాటు అందుతుందని తెలిపారు. గ్రామస్తులు, రైతులు ఈ కార్యక్రమానికి సహకరించాలని సిఐ పుల్యాల కిషన్ విజ్ఞప్తి చేశారు.

Latest articles

కేయు అధ్యాపకుడు డా. ఎల్. జితేందర్‌కు జాతీయ స్థాయి డిజైన్ పేటెంట్

పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎల్. జితేందర్ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించారు.

ఇంజనీర్ల సేవలు దేశ అభివృద్ధికి కీలకం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల సేవలు అత్యంత కీలకమైనవని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడంలో వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

టీజీఎన్పీడీసీఎల్‌కు రెండు జాతీయ పురస్కారాలు

హనుమకొండ: తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ రెండు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. నక్కలగుట్టలోని సంస్థ...

కేంద్ర పథకాలు వేగంగా అమలు చేయాలి: వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లాలని, అర్హులైన లబ్ధిదారులకు వాటి ప్రయోజనాలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అధికారులను ఆదేశించారు.
spot_img

Related Articles