హన్మకొండ: నగర ప్రజల సమస్యల పరిష్కారమే వేదికగా సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో ‘ప్రజావాణి’ (గ్రీవెన్స్) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ చంద్రశేఖర్, ఇతర ఉన్నతాధికారులు ప్రజల నుంచి నేరుగా వినతులను స్వీకరించారు.
నగరంలోని వివిధ విభాగాలకు సంబంధించి మొత్తం 86 వినతులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి:
టౌన్ ప్లానింగ్: 28
ఇంజనీరింగ్: 20
రెవెన్యూ: 14
హెల్త్ & శానిటేషన్: 14
నీటి సరఫరా: 10
ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.


