తనపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి Bandi Sanjay Kumar పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ఎప్పుడూ చట్టాన్ని గౌరవిస్తూ రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. తన రాజకీయ ప్రయాణంలో ఎలాంటి మచ్చ లేకుండా పనిచేశానని, న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందన్నారు.
రాజకీయంగా ఎదుర్కోలేక కుటుంబ సభ్యులు, పిల్లలను వివాదాల్లోకి లాగడం ప్రత్యర్థుల నిరాశను చూపిస్తోందని విమర్శించారు. గ్రామీణ స్థాయి నుంచి కార్పొరేటర్‌గా ప్రారంభమై ప్రజల మద్దతుతో కేంద్ర మంత్రిగా ఎదిగిన బీసీ నాయకుడి ఎదుగుదలను కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు.
ప్రధానమంత్రి Narendra Modi రేపటి సభకు ముందు తన ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో రాజకీయ కుట్ర జరుగుతోందని బండి సంజయ్ ఆరోపించారు. చివరికి నిజం వెలుగులోకి వస్తుందని, ప్రతి ఆరోపణకు కాలమే సమాధానం చెబుతుందని వ్యాఖ్యానించారు.
“సత్యమేవ జయతే” అంటూ తన ప్రకటనను ముగించారు.


