HomeWarangal Newsబంజారా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ డా. కడియం కావ్య

బంజారా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ డా. కడియం కావ్య

Published on

spot_img

హనుమకొండ

తేది: 25-01-2026

హనుమకొండ బస్టాండ్ సమీపంలోని శ్రీహర్ష కన్వెన్షన్ హాల్ నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా బంజారా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి స్థానిక శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి గారితో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు ముఖ్య అతిథిగా హాజరై బంజారా గోత్ర క్యాలెండర్ ను ఆవిష్కరించారు.

Dr Kadiyam Kavya
Dr Kadiyam Kavya

ఈ సందర్భంగా ఎంపీ డా.కడియం కావ్య మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుందని అన్నారు. విద్య, ఉపాధి, ఆరోగ్యం రంగాల్లో బంజారా సమాజం మరింత ముందుకు రావాలని ఆకాంక్షించారు.

తరతరాలుగా బంజారా సమాజం తన ప్రత్యేకమైన భాష, వేషధారణ, నృత్యాలు, పండుగలు, ఆచార సంప్రదాయాలను కాపాడుకుంటూ ముందుకు సాగడం అభినందనీయమని తెలిపారు.

బంజారా గోత్ర క్యాలెండర్ ఆవిష్కరణ ద్వారా యువతకు బంజారా సంస్కృతి, చరిత్రపై అవగాహన మరింత పెరుగుతుందని, ఇది గిరిజన వారసత్వాన్ని రాబోయే తరాలకు అందించే మంచి ప్రయత్నమని ఎంపీ అన్నారు.

బంజారా ఆత్మీయ సమ్మేళనం
MLA Naini Rajender Reddy

సామాజిక ఐక్యత, పరస్పర గౌరవం, సాంస్కృతిక విలువలే దేశ బలమని పేర్కొంటూ, ఇలాంటి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు సమాజాన్ని ఏకం చేసే వేదికలుగా నిలుస్తాయని చెప్పారు.

బంజారా సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎంపీ డా. కడియం కావ్య భరోసా ఇచ్చారు. హనుమకొండ లోని గిరిజన భవన అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పోరిక వీరన్న నాయక్, సంగెం మాజీ జెడ్పిటిసి వీరమ్మ, రిటైర్డ్ డిఈఓ జవహర్ లాల్ నాయక్, DMHO రవిరాథోడ్, రిటైర్డ్ ఆర్ జె డి వెంకట్రాం, మరియు భోజ్ నాయక్, డాక్టర్ రమేష్ నాయక్, వెంకట్ నాయక్,సర్పంచ్ బానోతు అరుణ రాజేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Latest articles

బ్రేక్‌ఫాస్ట్‌ లో ఈ ఫుడ్స్ తింటే కడుపు నిండుగా.. ఆరోగ్యం పదిలం!

ఉదయం అల్పాహారం రోజంతా శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఉండే సమతుల్యమైన ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే ఎక్కువసేపు ఎనర్జీగా ఉండొచ్చు.

ఇక యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. రూ.2 వేల దాటితే 0.4% ఫీజు!

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు విధించనున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం వరకు ఫీజు ఉండొచ్చనే సమాచారం వినిపిస్తోంది.

SSC CGL 2026: పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

SSC CGL 2026 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. CGL 2026 టైర్-1 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్ష తేదీలు, ముఖ్యమైన వివరాలను తెలుసుకోండి.

IIT JAM 2027: ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సులకు ప్రవేశాలు..!

IIT JAM 2027 ద్వారా దేశంలోని ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంది. అర్హత, దరఖాస్తు తేదీలు, పరీక్ష విధానం, ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి
spot_img

Related Articles

కేయు అధ్యాపకుడు డా. ఎల్. జితేందర్‌కు జాతీయ స్థాయి డిజైన్ పేటెంట్

పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎల్. జితేందర్ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించారు.

ఇంజనీర్ల సేవలు దేశ అభివృద్ధికి కీలకం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల సేవలు అత్యంత కీలకమైనవని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడంలో వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

టీజీఎన్పీడీసీఎల్‌కు రెండు జాతీయ పురస్కారాలు

హనుమకొండ: తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ రెండు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. నక్కలగుట్టలోని సంస్థ...