HomeLatest NewsBank of Barodaలో 206 ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేయండి

Bank of Barodaలో 206 ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేయండి

Published on

spot_img

Bank of Baroda: ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 206 స్పెషలిస్ట్ ఆఫీసర్ (Specialist Officer) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రెగ్యులర్ ప్రాతిపదికన చేపట్టే ఈ నియామకాలకు అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

విభాగాల వారీగా ఖాళీలు:

ఈ నియామకాల్లో చీఫ్ మేనేజర్, మేనేజర్, సీనియర్ మేనేజర్, ప్రొడక్ట్ మేనేజర్, టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ మేనేజర్, టెక్నికల్ సీనియర్ మేనేజర్ వంటి పోస్టులు ఉన్నాయి. డిజిటల్ బ్యాంకింగ్ విభాగంలో 19, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌లో 88, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో 16, సెక్యూరిటీలో 54, ఎంటర్‌ప్రైజ్ డేటా మేనేజ్‌మెంట్ ఆఫీస్‌లో 14, కార్పొరేట్ అకౌంట్స్ అండ్ ట్యాక్సేషన్ ప్లానింగ్‌లో 15 పోస్టులు ఉన్నాయి.

అర్హత, వయోపరిమితి:

పోస్టును బట్టి డిగ్రీ, బీఈ, బీటెక్, బీసీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, పీజీ లేదా సంబంధిత విద్యార్హత ఉండాలి. అభ్యర్థుల వయసు పోస్టును బట్టి 23 నుంచి 43 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే సంబంధిత రంగంలో 2 నుంచి 10 ఏళ్ల వరకు పని అనుభవం అవసరం.

ఎంపిక విధానం, జీతం:

అభ్యర్థుల దరఖాస్తులను తొలుత పరిశీలించి, అర్హత సాధించిన వారికి ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. అనంతరం సైకోమెట్రిక్ టెస్ట్, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఉంటాయి. కొన్ని పోస్టులకు గ్రూప్ డిస్కషన్ కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.48,480 నుంచి రూ.1,02,300 వరకు వేతనం లభిస్తుంది.

దరఖాస్తుకు చివరి తేదీ:

జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.850 కాగా, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళలు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు రూ.175గా నిర్ణయించారు. ఆగస్టు 26 దరఖాస్తుకు చివరి తేదీ. ఎంపికైన అభ్యర్థులను దేశవ్యాప్తంగా బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలు, కార్యాలయాల్లో నియమిస్తారు. పూర్తి వివరాల కోసం బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను www.bankofbaroda.in చూడండి..

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.