హన్మకొండ: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బీసీలకు మొండిచేయి చూపించారని ఆరోపిస్తూ హన్మకొండలో బీసీ సంఘాల నాయకులు భారీ నిరసన చేపట్టారు. హన్మకొండలోని ఏకశిల పార్క్ నుండి అమరవీరుల స్థూపం వరకు బీసీ సంఘాల నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. అమరవీరుల స్థూపం వద్ద బడ్జెట్ ప్రతులను తగులబెట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ‘కామారెడ్డి బీసీ డిక్లరేషన్’ ఊసే ఈ బడ్జెట్‌లో లేదని, బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పించలేదని నాయకులు మండిపడ్డారు


