హైదరాబాద్, మే 15: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బీసీ అభివృద్ధి & సంక్షేమ శాఖ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి. హనుమంతరావును టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌తో కలిసి గురువారం నాడు వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కె.ఆర్ నాగరాజు మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు.
అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ బీసీ వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. వి. హనుమంతరావు అనుభవం, ప్రజాసేవా దృక్పథం రాష్ట్రంలోని బీసీ వర్గాల సాధికారతకు మరింత దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


