HomePoliticsఅయోధ్య తరహాలో భద్రాచలం అభివృద్ధి.. 27న రామయ్య కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డి

అయోధ్య తరహాలో భద్రాచలం అభివృద్ధి.. 27న రామయ్య కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డి

Published on

spot_img

భద్రాచలం: దక్షిణ అయోధ్యగా పిలవబడే భద్రాచలం పుణ్యక్షేత్రం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. సుమారు రూ. 350 కోట్ల వ్యయంతో ఆలయ మాస్టర్ ప్లాన్ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. అయోధ్య రామాలయాన్ని తలపించేలా ఆలయ ప్రాంగణ విస్తరణ, మాడ వీధుల నిర్మాణం, క్యూ కాంప్లెక్స్ వంటి పనులను చేపట్టనున్నారు.

​ఈ నెల 27న జరగనున్న శ్రీరామనవమి తిరుకల్యాణ మహోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారు. అదేవిధంగా 28న జరిగే శ్రీరామ పట్టాభిషేక మహోత్సవానికి రాష్ట్ర నూతన గవర్నర్ శివప్రతాప్ శుక్లా హాజరుకానున్నారు. ఇప్పటికే ఆలయ అభివృద్ధికి అవసరమైన రూ. 34 కోట్ల నిధులను భూసేకరణ కోసం ప్రభుత్వం విడుదల చేసింది.

Latest articles

నిద్రపోయేటప్పుడు ఫోన్‌ను ఎంత దూరంలో పెట్టాలి? నిపుణుల సూచనలు !

నిద్రపోయే సమయంలో ఫోన్‌ను బెడ్‌కు దూరంగా పెట్టడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడటంతో పాటు స్క్రీన్ టైమ్ తగ్గుతుంది. ఫోన్‌ను దూరంగా ఉంచడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోండి

హనుమకొండలో భారీ అగ్నిప్రమాదం: హోటల్ యజమాని దుర్మరణం, భార్య పరిస్థితి విషమం

హనుమకొండ జిల్లా పరిధిలోని అదాలత్ జంక్షన్ వద్ద ఉన్న ప్రముఖ 'లింగాల కేదారి హోటల్'లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంతో హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ముంబై ఎక్స్‌పోలో పాల్గొన్న జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న

ముంబైలో నిర్వహించిన అంతర్జాతీయ పర్యావరణ పరిజ్ఞాన ప్రదర్శన 'IFAT India 2026' సదస్సులో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న పాల్గొన్నారు.

కాంగ్రెస్, BRSలపై ఫైర్ అయిన బీజేపీ నేత రామచందర్ రావు

రాష్ట్రంలో కాంగ్రెస్, BRS పార్టీలు ప్రజా సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసి, వీధి నాటకాలు ఆడుతున్నాయని బీజేపీ నేత ఎన్. రామచందర్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పబ్లిసిటీ కోసమే ఆ రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని, వారి వైఖరిని చూసి తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.
spot_img

Related Articles

కాంగ్రెస్, BRSలపై ఫైర్ అయిన బీజేపీ నేత రామచందర్ రావు

రాష్ట్రంలో కాంగ్రెస్, BRS పార్టీలు ప్రజా సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసి, వీధి నాటకాలు ఆడుతున్నాయని బీజేపీ నేత ఎన్. రామచందర్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పబ్లిసిటీ కోసమే ఆ రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని, వారి వైఖరిని చూసి తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.

కొండా సురేఖను బీఆర్‌ఎస్‌లోకి రానివ్వం: జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ నాయకురాలు, మంత్రి కొండా సురేఖను బీఆర్‌ఎస్ పార్టీలోకి చేర్చుకునే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. కొండా సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వబోమని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కొండా దంపతులకు జనసేనలో నో ఎంట్రీ? సుస్మితకు మాత్రమే గ్రీన్ సిగ్నల్

మాజీ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీలను జనసేన పార్టీలోకి తీసుకోవద్దనే ఆలోచనలో జనసేనాని ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితకు మాత్రమే పార్టీలోకి ఆహ్వానం పలికే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.