HomeLatest Newsభద్రాచలం ఆలయ అభివృద్ధిపై సీఎం కీలక ఆదేశాలు

భద్రాచలం ఆలయ అభివృద్ధిపై సీఎం కీలక ఆదేశాలు

Published on

spot_img

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ అభివృద్ధి పనులు ఆగమ శాస్త్రానుసారం మరియు ఆలయ సహజత్వాన్ని కాపాడే విధంగా చేపట్టాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులకు స్పష్టం చేశారు. ఆలయ అభివృద్ధి ప్రణాళికలపై జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం సమగ్రంగా సమీక్షించారు.

🛕 ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారితో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇప్పటికే జరిగిన భూసేకరణకు అనుగుణంగా రూపొందించిన పలు అభివృద్ధి డిజైన్లను సీఎం పరిశీలించారు.

Godavari Pushkaralu

🛕 భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అభివృద్ధి పనులను మూడు దశల్లో పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.

🛕 రాబోయే గోదావరి పుష్కరాలు దృష్టిలో పెట్టుకుని ముందుగా పూర్తి చేయాల్సిన పనులను గుర్తించి, అంచనాలతో కూడిన మొదటి దశ ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

Bhadrachalam

🛕 ఆలయ సమీపంలో పుష్కర ఘాట్ల నిర్మాణం మరియు అభివృద్ధి పనులు పుష్కరాల ప్రణాళికలకు అనుగుణంగా చేపట్టాలని పేర్కొన్నారు.

🛕 2027 మార్చి 31 నాటికి మొదటి దశ పనులు పూర్తి చేయాలి అనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది.

🛕 పుష్కరాలు ముగిసిన తరువాత మిగతా పనుల కోసం కూడా ఇప్పటి నుంచే ప్రణాళికలు, అంచనాలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.

ఈ సమీక్షలో మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, బలరాం నాయక్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Latest articles

బ్రేక్‌ఫాస్ట్‌ లో ఈ ఫుడ్స్ తింటే కడుపు నిండుగా.. ఆరోగ్యం పదిలం!

ఉదయం అల్పాహారం రోజంతా శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఉండే సమతుల్యమైన ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే ఎక్కువసేపు ఎనర్జీగా ఉండొచ్చు.

ఇక యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. రూ.2 వేల దాటితే 0.4% ఫీజు!

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు విధించనున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం వరకు ఫీజు ఉండొచ్చనే సమాచారం వినిపిస్తోంది.

SSC CGL 2026: పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

SSC CGL 2026 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. CGL 2026 టైర్-1 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్ష తేదీలు, ముఖ్యమైన వివరాలను తెలుసుకోండి.

IIT JAM 2027: ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సులకు ప్రవేశాలు..!

IIT JAM 2027 ద్వారా దేశంలోని ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంది. అర్హత, దరఖాస్తు తేదీలు, పరీక్ష విధానం, ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి
spot_img

Related Articles

నవోదయ సీటు మీ లక్ష్యమా? ప్రిపరేషన్ ఇలా ఉంటే సక్సెస్ పక్కా!

నవోదయ ప్రవేశ పరీక్షలో మంచి మార్కులు సాధించాలంటే ముందుగా సిలబస్, పరీక్ష విధానాన్ని అర్థం చేసుకుని ప్రణాళికాబద్ధంగా చదవాలి. రోజువారీ ప్రాక్టీస్, మాక్ టెస్టులు, టైమ్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెడితే పరీక్షకు మెరుగ్గా సిద్ధం కావచ్చు.

ఇక యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. రూ.2 వేల దాటితే 0.4% ఫీజు!

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు విధించనున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం వరకు ఫీజు ఉండొచ్చనే సమాచారం వినిపిస్తోంది.

SSC CGL 2026: పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

SSC CGL 2026 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. CGL 2026 టైర్-1 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్ష తేదీలు, ముఖ్యమైన వివరాలను తెలుసుకోండి.