భద్రఖాళీ ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా మాడ వీధుల నిర్మాణం కారణంగా ఇళ్లు కోల్పోతున్న 17 కుటుంబాలకు ప్రభుత్వం సహాయం అందించింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. స్వచ్చందంగా ముందుకు వచ్చిన ఈ 17 కుటుంబాలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లతో పాటు, ఔట్‌సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ గారు, కూడా చైర్మన్ ఇనగల వెంకట్రామ్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.


