హన్మకొండ: హన్మకొండ శివారు ప్రాంతాల్లో దొంగలు బరితెగిస్తున్నారు. భీమారంలోని గౌరీశంకర్ దేవాలయం సమీపంలో తాజాగా చోటుచేసుకున్న ఓ ద్విచక్ర వాహన చోరీ స్థానికంగా కలకలం రేపింది.
స్థానిక నివాసి చింతల అనూషకు చెందిన నీలిరంగు హోండా యాక్టివా స్కూటీని ఓ దుండగుడు అందరూ చూస్తుండగానే అపహరించాడు. పట్టపగలే అత్యంత ధైర్యంగా వాహనాన్ని తీసుకుని వెళ్తున్న దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.


