HomeLatest NewsHealth: టీ లవర్స్ కు బిగ్ అలర్ట్.. ఆలస్యం చేస్తే డేంజర్ లో పడ్డట్టే..!

Health: టీ లవర్స్ కు బిగ్ అలర్ట్.. ఆలస్యం చేస్తే డేంజర్ లో పడ్డట్టే..!

Published on

spot_img

Tea : పొద్దు పొద్దున్నే లేచి లేవగానే పరుగు పరుగున వంట గదిలోకి వెళ్లి.. చిక్కటి పాలల్లో.. కొంచెం టీ పౌడర్ వేసి.. ఇంకొంచెం చక్కర వేసి.. కుదిరితే కొంచెం చక్క.. రెండు యాలకులు వేసుకొని బాగా మరగపెట్టుకుని..

అలా కప్పులో పోసుకొని ఆస్వాదిస్తూ “టీ” ని ఇష్టంగా తాగుతుంటారు కొంతమంది జనాలు.

అయితే అది ఆరోగ్యానికి ప్రమాదకరమని తెలిసినా కూడా ఇంకా ఆ అలవాటును మానుకొనే మానుకోరు. మార్నింగ్ లేవగానే నేరుగా టీ తాగడం చాలామందికి అలవాటు ఉండే ఉంటుంది.

కానీ ఇప్పుడు అందరికీ ఒక అవగాహన అయితే వచ్చింది. ప్రొద్దున్నే లేవగానే ఖాళీ కడుపుతో టీ తాగకూడదు అని..

అలా తాగితే గ్యాస్ట్రిక్ సమస్యలు అలాగే కిడ్నీ సమస్యలు ఎక్కువగా వస్తాయి అని ఇంట్లో ఉండే పిల్లలు లేదా..

ఇరుగుపొరుగువారు లేదా.. టీవీలో లేదా.. సోషల్ మీడియాలో ఎక్కడొ ఒకచోట చదివే ఉంటాం. వినే ఉంటాం. కానీ కొంతమంది మాత్రం మార్నింగ్ లేవగానే “టీ” తాగే అలవాటును అస్సలు మానుకోలేరు.

ఇప్పటికీ చాలామంది మనలో కూడా పొద్దున్నే లేవగానే “టీ” తాగితే కానీ రోజు మొదలవ్వదేమో అన్న విధంగా చేస్తూ ఉంటారు .

అయితే ఈ అలవాటు చాలా చాలా ప్రమాదకరమంటూ ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా చాలామంది మార్నింగ్ లేవగానే టీ తాగే అలవాటు అలాగే కంటిన్యూ చేస్తున్నారని.. దీర్ఘకాలంలో ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీయొచ్చు అని హెచ్చరిస్తున్నారు.

ఈ అలవాటు ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో కిడ్నీ సమస్యలు మరింత పెరిగిపోతాయి అని హెచ్చరిస్తున్నారు.

కాళీ కడుపుతో టీ తాగితే కిడ్నీలో స్టోన్స్ ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది అంటూ హెచ్చరిస్తున్నారు.

“టీ”లో సహజంగానే ఆక్సిలేట్లు ఉంటాయి. ఖాళీ కడుపుతో టీ తాగినప్పుడు ఈ కాంపౌండ్స్ నేరుగా కిడ్నీలకు చేరుకుంటాయి.

ఇవి శరీరంలోనికి కాల్షియంతో కలిసి స్పటికాలుగా మారి కాలక్రమేన అలా అలా కిడ్నీ స్టోన్స్ గా మారుతాయట.

ఇవి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అంటూ హెచ్చరిస్తున్నారు డాక్టర్లు.

అంతేకాదు టీ లోని కెఫిన్ కాళీ కడుపుతో తీసుకున్నప్పుడు రక్తపోటు అకస్మాత్తుగా పెరిగిపోతుంది అని.. ఇది బిపి పేషెంట్స్ కి భారీ డేంజర్ అని హెచ్చరిస్తున్నారు.

ఇది దీర్ఘకాలంలో కిడ్నీలోని రక్తనాళాలను దెబ్బతీస్తుంది అంటూ చెబుతున్నారు. అంతేకాదు పొద్దున్నే లేవగానే టీ తాగడం వలన గ్యాస్ సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి అని హెచ్చరిస్తున్నారు.

ఉదయం లేవగానే గోరువెచ్చని నీళ్లు రెండు గ్లాసులు తాగితే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. జీర్ణ సమస్యలు రావు.

అదేవిధంగా బరువు తగ్గాలి అనుకునే వారు..ఏ ఆరోగ్య సమస్యలు లేని వాళ్ళు కూడా ఇలా మార్నింగ్ ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం ఉత్తమం అని డాక్టర్లు సూచిస్తున్నారు.

Latest articles

AI 80’s ఫోటో ట్రెండ్‌పై నిపుణుల హెచ్చరిక.. ఫోటోలు అప్‌లోడ్ చేసే ముందు జాగ్రత్త!

AI టూల్స్‌తో 1980ల నాటి ఫోటోల తరహాలో చిత్రాలను మార్చుకునే ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే వ్యక్తిగత ఫోటోలను AI ప్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేసే ముందు ప్రైవసీ, డేటా భద్రతపై జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బిగ్ బాస్ హోస్టుల రెమ్యునరేషన్.. ఒక్కో సీజన్‌కు కోట్లలో పారితోషికం!

బిగ్ బాస్ షోకు హోస్టులుగా వ్యవహరించిన ప్రముఖ నటులు, సెలబ్రిటీలకు భారీగా పారితోషికం అందినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కో సీజన్‌కు ఎవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసుకోవాలంటే ఈ వివరాలు చూడాల్సిందే.

అభిమానం అంటే ఇదే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసిన పనికి ప్రశంసలు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) సామాజిక బాధ్యతలో భాగంగా కీలక కార్యక్రమం చేపట్టింది. హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ నివారణపై దేశవ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది బాలికలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

నిద్రలో పదేపదే మేల్కొంటున్నారా? మీ శరీరం చెప్తుందే ఇదే..!

రాత్రిపూట నిద్రలో పదేపదే మెలకువ రావడానికి ఒత్తిడి, ఆందోళన, కెఫిన్, గది వాతావరణం వంటి కారణాలు ఉండొచ్చు. అయితే గురకతో పాటు శ్వాస ఆగడం, పగటిపూట అధిక నిద్రమత్తు ఉంటే స్లీప్ అప్నియా సంకేతాలు కావచ్చు.
spot_img

Related Articles

విద్యార్థుల ఖాతాల్లోనే నేరుగా ఫీజు రీయింబర్స్ మెంట్: శాసనసభలో సీఎం కీలక ప్రకటన

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ఎత్తివేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా తెరదించారు.

AI 80’s ఫోటో ట్రెండ్‌పై నిపుణుల హెచ్చరిక.. ఫోటోలు అప్‌లోడ్ చేసే ముందు జాగ్రత్త!

AI టూల్స్‌తో 1980ల నాటి ఫోటోల తరహాలో చిత్రాలను మార్చుకునే ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే వ్యక్తిగత ఫోటోలను AI ప్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేసే ముందు ప్రైవసీ, డేటా భద్రతపై జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మెహందీ కళాకారుల ఉద్యోగాలకు ఎసరు? వైరల్ AI వీడియోతో కొత్త భయం!

మెహందీ ఆర్టిస్టుల పనిని సులభతరం చేసేలా కనిపిస్తున్న ఓ మెషీన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా షేర్ చేసిన ఈ AI-generated వీడియోపై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు.