హనుమకొండ జిల్లా:
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాను సంగెం పోలీసులు అరెస్ట్ చేశారు.
గవిచర్ల గ్రామంలోని గుండు సమ్మయ్య ఆలయం సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో రెండు బైక్‌లపై ఆరుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో వారు ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడినట్లు అంగీకరించినట్లు అధికారులు తెలిపారు.
పోలీసులు ఈ ముఠా నుంచి సుమారు రూ.15 లక్షల విలువైన 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన ఏడుగురిలో నలుగురు మైనర్లు ఉన్నట్లు వెల్లడించారు.
జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక విచారణలో బయటపడినట్లు పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


