హన్మకొండ: వరంగల్ నగర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న భారీ నిధులను రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులు దుర్వినియోగం చేస్తున్నారని హన్మకొండ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షురాలు రావు పద్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
వరంగల్‌ను హైదరాబాద్‌కు ధీటుగా మారుస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారే తప్ప, క్షేత్రస్థాయిలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని ఆమె విమర్శించారు. ప్రస్తుతం నగరంలో జరుగుతున్న కొద్దిపాటి పనులు కూడా కేంద్రం ఇచ్చిన నిధులతోనే సాగుతున్నాయని ఆమె స్పష్టం చేశారు. కేంద్రం పంపిన నిధులను కాంగ్రెస్ నాయకులు తమ స్వార్థానికి వాడుకుంటూ నగరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.
నగర ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, కేంద్ర నిధుల వినియోగంపై పారదర్శకత ఉండాలని ఈ సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు.


