హైదరాబాద్: ధరణి పోర్టల్ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి మరియు 22A నిషేధిత భూముల వివాదంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీజేపీ నాయకత్వం సిద్ధమైంది. ఈ అంశాలపై శనివారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ‘మహాదీక్ష’ చేపట్టనుంది.
వేలాది ఎకరాల భూములను రాత్రికి రాత్రే నిషేధిత జాబితాలోకి చేర్చారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ భూముల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపేందుకు తక్షణమే ‘హౌస్ కమిటీ’ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ మహాదీక్ష కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి తదితర ముఖ్య నేతలు పాల్గొననున్నారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


