HomeWarangal Newsసమయస్ఫూర్తితో వ్యక్తి ప్రాణాలు కాపాడిన బ్లూకోల్ట్ సిబ్బంది

సమయస్ఫూర్తితో వ్యక్తి ప్రాణాలు కాపాడిన బ్లూకోల్ట్ సిబ్బంది

Published on

spot_img

హనుమకొండ కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తిని సమయస్ఫూర్తితో స్పందించి ప్రాణాపాయం నుంచి కాపాడిన బ్లూకోల్ట్ సిబ్బంది వీరాస్వామి, తరుణ్ కుమార్‌లను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ అభినందించారు. వారికి నగదు రివార్డులు అందజేశారు.

గుండ్ల సింగారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన అతని భార్య డయల్ 112కు సమాచారం అందించింది. వెంటనే స్పందించిన కేయూ ఇన్‌స్పెక్టర్ రవికుమార్, ఎస్‌ఐ శ్రావణి బ్లూకోల్ట్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. మొబైల్ లొకేషన్ ఆధారంగా చింతగట్టు గ్రామ శివారులోని రైల్వే ట్రాక్ ప్రాంతంలో ఉన్న వ్యక్తిని గుర్తించిన సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని అతడిని సురక్షితంగా కాపాడి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Warangal CP

ప్రజల ప్రాణాలు, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించే పోలీసు సిబ్బందిని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని సీపీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత, అదనపు డీసీపీ రాయల ప్రభాకర్ రావు, కేయూ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ పాల్గొన్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles