HomeWarangal Newsఅంబేద్కర్ భవన్‌లో బూత్ లెవల్ ఏజెంట్లకు అవగాహన సమావేశం..!

అంబేద్కర్ భవన్‌లో బూత్ లెవల్ ఏజెంట్లకు అవగాహన సమావేశం..!

Published on

spot_img

అంబేద్కర్ భవన్‌లో బూత్ లెవల్ ఏజెంట్లకు అవగాహన సమావేశం:

హనుమకొండ నగరంలోని అంబేద్కర్ భవన్ లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో బూత్ లెవెల్ ఏజెంట్స్ కోసం ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇనగల వెంకట్రామ్ రెడ్డి పాల్గొని ఏజెంట్లకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమానికి వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎన్నికల అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు.

ఓటర్ల జాబితా సవరణపై దిశా నిర్దేశం:

సమావేశంలో ఇనగల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి BLA బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనలకు కచ్చితంగా పాటిస్తూ గ్రామస్థాయిలో ఓటర్ల వివరాలను సేకరించాలని చెప్పారు. ప్రతి ఏజెంట్ తమ పరిధిలోని బూతు లెవెల్ ఆఫీసర్ ని వెంటనే కలుసుకొని కాంగ్రెస్ పార్టీ BLA గా పరిచయం చేసుకోవాలని సూచించారు.

లింక్ కానీ ఓటర్ల పై ప్రత్యేక దృష్టి:

2025 ఓటర్ల జాబితాను 2002 జాబితాతో అనుసంధానం చేసే ప్రక్రియలో లింక్ కానీ ఓటర్ల వివరాలను గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. లింక్ అయిన ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారం అందుతుందని లింక్ కాని వారు తగిన గుర్తింపు పత్రాలతో ఫారం నింపాల్సి ఉంటుందని వివరించారు. ముఖ్యంగా 18 నుంచి 43 ఏళ్ల మధ్య వయసు గల ఓటర్ల కుటుంబ వివరాలను సేకరించాలని సూచించారు.

ముందస్తు సన్నాహాలు చేయాలని సూచన:

వలస వెళ్లిన ఓటర్ల పాత నియోజకవర్గం ఇంటి నెంబర్, పాత ఓటర్ ఐడి వివరాలను సేకరిస్తే మ్యాపింగ్ సులభం అవుతుందని తెలిపారు. పార్టీ మద్దతుదారుల ఆధార్ కార్డ్, పాత ఓటర్ ఐడి, పుట్టిన తేదీ, ధ్రువీకరణ పత్రాలను ముందుగానే సిద్ధం చేయాలని కోరారు, ఎన్యూమరేషన్ ప్రక్రియ ప్రారంభానికి ముందే ఎక్కువ మంది ఓటర్లను లింక్ చేసేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు మరియు భారీ సంఖ్యలో బూత్ లెవెల్ ఏజెంట్లు పాల్గొన్నారు.

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

ఐఫోన్‌లో కొత్త శకం.. ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది!

యాపిల్ ఎట్టకేలకు ఫోల్డబుల్ ఐఫోన్‌ను లాంచ్ చేసి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. కొత్త డిజైన్, ఫోల్డింగ్ డిస్‌ప్లే, అధునాతన ఫీచర్లతో వచ్చిన ఈ ఐఫోన్‌పై టెక్ ప్రియుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

నందు బిగ్ బాస్‌లోకి వస్తే..నాగార్జునకు కొత్త తలనొప్పి తప్పదా?

బిగ్ బాస్ తెలుగు 10లో నందు ఎంట్రీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. నందు హౌస్‌లోకి వస్తే హోస్ట్ నాగార్జునకు కొత్త తలనొప్పులు తప్పవా? ఆమెకు సంబంధించిన వివాదాలు షోపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

హనుమకొండలో తీవ్ర విషాదం: అగ్నిప్రమాదంలో హోటల్ యజమాని భార్య మృతి

హనుమకొండలోని అదాలత్ కూడలిలో నిన్న (బుధవారం) రాత్రి సంభవించిన అగ్నిప్రమాదం ఒక కుటుంబాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచేసింది. ఈ ప్రమాదంలో హోటల్ యజమాని లింగాల కేదారి నిన్న రాత్రే దుర్మరణం చెందగా, తీవ్రంగా గాయపడిన ఆయన భార్య పుష్పలత (52) ఈరోజు (గురువారం) చికిత్స పొందుతూ కన్నుమూశారు.

నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాలు: నేడు 22A నిషేధిత భూములపై చర్చ

తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు నాలుగో రోజు తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగుతున్నాయి. నేటి సమావేశాల్లో ప్రధానంగా రిజిస్ట్రేషన్ చట్టం పరిధిలోని సెక్షన్ 22ఆ అంశంపై ఉభయ సభల్లో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య సుదీర్ఘమైన, వాడీవేడి చర్చ జరగనుంది.
spot_img

Related Articles

హనుమకొండలో తీవ్ర విషాదం: అగ్నిప్రమాదంలో హోటల్ యజమాని భార్య మృతి

హనుమకొండలోని అదాలత్ కూడలిలో నిన్న (బుధవారం) రాత్రి సంభవించిన అగ్నిప్రమాదం ఒక కుటుంబాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచేసింది. ఈ ప్రమాదంలో హోటల్ యజమాని లింగాల కేదారి నిన్న రాత్రే దుర్మరణం చెందగా, తీవ్రంగా గాయపడిన ఆయన భార్య పుష్పలత (52) ఈరోజు (గురువారం) చికిత్స పొందుతూ కన్నుమూశారు.

ఇసుక ట్రాక్టర్ – ఆటో ఢీ: ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

పర్వతగిరి మండల పరిధిలోని అన్నారం గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఒక ఇసుక ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.

హనుమకొండలో భారీ అగ్నిప్రమాదం: హోటల్ యజమాని దుర్మరణం, భార్య పరిస్థితి విషమం

హనుమకొండ జిల్లా పరిధిలోని అదాలత్ జంక్షన్ వద్ద ఉన్న ప్రముఖ 'లింగాల కేదారి హోటల్'లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంతో హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.