HomeWarangal Newsకాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ పోరుబాట.. అరూరి రమేష్ కీలక పిలుపు !

కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ పోరుబాట.. అరూరి రమేష్ కీలక పిలుపు !

Published on

spot_img

కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ పోరుబాట.. అరూరి రమేష్ కీలక పిలుపు :

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో ఆ పార్టీ ఇచ్చిన హామీలు, పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ సిద్ధమవుతోందని వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ తెలిపారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు సెప్టెంబర్‌ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

హామీల అమలుపై కాంగ్రెస్‌ను ప్రశ్నించాలి :

ఐనవోలు క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అరూరి రమేష్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి, అనంతరం వాటి అమలులో జాప్యం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. వెయ్యి రోజులు పూర్తవుతున్నా నెరవేరని హామీలపై ప్రజలకు వాస్తవాలను వివరించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా కార్యాచరణ :

కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో వివిధ వర్గాలకు జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించేందుకు వారం రోజుల పాటు విభిన్న రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని అరూరి రమేష్ తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ నాయకులు మసూద్, ఎల్లవుల లలిత యాదవ్, గజ్జెల శ్రీరాములు, మార్గం బిక్షపతి, బండి రజని, తంపుల మోహన్, ఎర్రబెల్లి రాజేశ్వరరావు, తుళ్ల కుమార్, గోధుమల మధు, నరేడ్ల శ్రీధర్, నేరెళ్ల రాజు, కేతిరి రాజశేఖర్, జైపాల్, వినోద్, ఆవల రాధికా రెడ్డి, సిరంగి సునీల్, రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles