HomePoliticsకాంగ్రెస్ కక్షపూరిత రాజకీయాలు చేస్తోంది: దాస్యం వినయ్ భాస్కర్

కాంగ్రెస్ కక్షపూరిత రాజకీయాలు చేస్తోంది: దాస్యం వినయ్ భాస్కర్

Published on

spot_img

హనుమకొండ, బాలసముద్రం:

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేస్తూ రెండున్నర సంవత్సరాలు గడిపిందని ఆయన ఆరోపించారు. ఎన్నికల సమయంలో 420 హామీలు, 6 గ్యారంటీలు ఇచ్చిన కాంగ్రెస్ వాటి అమలును పక్కనబెట్టి డైవర్షన్ రాజకీయాలు చేస్తోందన్నారు.

బాధ్యత గల ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్ ప్రజల తరపున పోరాడుతోందని స్పష్టం చేశారు. “మా పార్టీ కార్యాలయాలు జనతా గ్యారేజ్‌లా ప్రజల సమస్యల పరిష్కారానికి పనిచేస్తున్నాయి” అని వ్యాఖ్యానించారు.

దేవాదుల ప్రాజెక్టు 90 శాతం పనులు బీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిందని, మిగిలిన 10 శాతం పనులను కూడా ఈ ప్రభుత్వం రెండేళ్లలో పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు.

ఇటీవల టి హరీష్ రావు దేవాదుల ప్రాజెక్టు పరిశీలనకు వచ్చినప్పుడు అధికారులు కనీస ప్రోటోకాల్ కూడా ఇవ్వలేదని తెలిపారు.

రైతులకు సాగునీరు అందించలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు.

ఏపీ, తెలంగాణ డీసీసీ అధ్యక్షుల సమావేశంలో పార్టీ కోసం 1000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పడం ఎవరి సొమ్ముతో అని ప్రశ్నించారు.

అభివృద్ధి పనుల పేరుతో అవినీతి సొమ్ము కూడబెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

మాట మారుస్తున్న ప్రభుత్వం

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవాదుల ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని తాజాగా ప్రకటించారని, ఇదే ప్రభుత్వం గతంలో 2024 ఆగస్టు 21న పూర్తి చేస్తామని, మంత్రులు 2025లో పూర్తి చేస్తామని చెప్పారని గుర్తుచేశారు.

ఒకే ప్రభుత్వం పదే పదే మాట మార్చడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు.

ముఖ్యమంత్రి 50 నిమిషాల పర్యటన చేసి వెళ్లిపోయారని, కనీసం సమీక్ష సమావేశం కూడా నిర్వహించలేదని ఆరోపించారు.

దేవాదులపై సమీక్షలు కేవలం ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల నిధుల కోసం చేస్తున్న చర్యలేనని అన్నారు.

దేవాదుల మూడో దశ నిర్మాణ వ్యయం రూ.17,000 కోట్ల నుంచి రూ.24,000 కోట్లకు ఎలా పెరిగిందని ప్రశ్నించారు.

అదనంగా పెరిగిన రూ.7,000 కోట్లలో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో దేవాదుల అంశంపై రైతుల తరఫున ఆందోళనలు చేపడతామని తెలిపారు.

కాంగ్రెస్ వైఖరిపై తీవ్ర విమర్శలు

మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ, హరీష్ రావు పర్యటన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి హడావుడిగా వచ్చి వెళ్లిపోయారని అన్నారు.

ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల మాటల్లో ఏకరూపత లేదని విమర్శించారు.

కేసీఆర్ ప్రభుత్వం రూ.7,000 కోట్లు కేటాయించి దేవాదుల ఫేజ్-1, ఫేజ్-2లను పూర్తి చేసి, ఫేజ్-3 పనులు ప్రారంభించిందని పేర్కొన్నారు.

అయితే రెండేళ్లు దాటినా ప్రస్తుత ప్రభుత్వం దేవాదులలో గణనీయమైన పురోగతి సాధించలేదని ఆరోపించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా ముఖ్యమంత్రి గతంలో విమర్శలు చేసి, ఇప్పుడు భిన్నంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవ రెడ్డి, కార్పొరేటర్ జోరిక రమేష్, నాయకులు జానకి రాములు, చందర్, అఫ్జల్, మట్టపెల్లి రమేష్, పులి రజినీకాంత్, నార్లగిరి రమేష్, జనార్థన్ గౌడ్, దశరథం, రఘు, నయీమొద్దీన్, కోటిలింగం, వినోద్ కుమార్, రామ్మూర్తి, రాజు, కనకరాజు తదితరులు పాల్గొన్నారు.

Latest articles

తెలంగాణలో దసరా సెలవులు ఎప్పట్నుంచి? పూర్తి వివరాలు ఇవే!

తెలంగాణలో ఈసారి దసరా సెలవులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? ఎన్ని రోజులు ఉంటాయి? పాఠశాలలకు సెలవుల తేదీలు, పునఃప్రారంభ తేదీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోండి.

నందు సడెన్ ఎంట్రీ వెనుక పెద్ద స్కెచ్? బిగ్‌బాస్ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ నిజమేనా..?

నందు సడెన్‌గా ఇండియాకు రావడం, హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వెంటనే పోలీసుల అదుపులోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అసలు ఆమె ఎంట్రీ వెనుక ఏదైనా స్కెచ్ ఉందా? బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం నిజమేనా అనే చర్చ జోరుగా సాగుతోంది.

దవడ చూపిస్తూ విజయ్ చేసిన సైగ..సోషల్ మీడియాలో రచ్చ రచ్చ..!

తాను మాట్లాడే సమయంలో సహజంగా వ్యక్తమయ్యే హావభావాలను తప్పుగా అర్థం చేసుకోవద్దని విజయ్ కోరారు. తన చర్యలు, సంజ్ఞలు ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో చేసినవి కావని పేర్కొన్నారు

“ధురంధర్’ సాంగ్‌తో మోదీకి గ్రాండ్ వెల్‌కమ్”.. గూస్ బంప్స్ వీడియో..!

గుజరాత్‌లోని వడోదర పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి అదిరిపోయే స్వాగతం లభించింది. ఆయన స్టేజ్‌పైకి రాగానే ‘ధురంధర్’ సినిమాలోని ‘ఆరి ఆరి’, ‘We Will Rock You’ పాటలు వినిపించడంతో అక్కడి వాతావరణం ఉత్సాహంగా మారింది.
spot_img

Related Articles

కొండా సురేఖను బీఆర్‌ఎస్‌లోకి రానివ్వం: జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ నాయకురాలు, మంత్రి కొండా సురేఖను బీఆర్‌ఎస్ పార్టీలోకి చేర్చుకునే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. కొండా సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వబోమని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కొండా దంపతులకు జనసేనలో నో ఎంట్రీ? సుస్మితకు మాత్రమే గ్రీన్ సిగ్నల్

మాజీ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీలను జనసేన పార్టీలోకి తీసుకోవద్దనే ఆలోచనలో జనసేనాని ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితకు మాత్రమే పార్టీలోకి ఆహ్వానం పలికే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

బీసీ మంత్రిని బర్తరఫ్ చేయడం అన్యాయం: వేణుగోపాల్ గౌడ్

బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేయడం తీవ్ర అన్యాయమని బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ గౌడ్ పేర్కొన్నారు.