జనగామ బిఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. ఆర్థిక శాఖ సెక్రటరీగా నమ్మబలికిన ఓ వ్యక్తి ఎమ్మెల్యేను బురిడీ కొట్టించాడు.
గుర్తు తెలియని వ్యక్తి ఎమ్మెల్యేకు ఫోన్ చేసి, తాను ఆర్థిక శాఖ సెక్రటరీని అని పరిచయం చేసుకున్నాడు. ‘వికసిత్ భారత్ స్కీమ్’ కింద అర్హులకు రూ.10 లక్షల రుణం ఇప్పిస్తానని నమ్మించాడు. దరఖాస్తుకు ఈరోజే చివరి రోజని, ఒక్కొక్కరికి రూ.2,500 చొప్పున పంపాలని కోరగా.. ఎమ్మెల్యే 40 మంది లబ్ధిదారులకు కలిపి రూ.1 లక్ష ఫోన్ పే (PhonePe) చేశారు.
కొంత సమయం తర్వాత తాను మోసపోయానని గ్రహించిన ఎమ్మెల్యే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.


